పెళ్లి ఫోటోలు షేర్ చేసిన విద్యుల్లేఖ రామన్.. హీరోయిన్ కి ఏ మాత్రం తగ్గని రేంజ్ లో?

ఎన్నో తెలుగు సినిమాలలో హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలలో ఎంతో అద్భుతంగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న లేడీ కమెడియన్ విద్యుల్లేఖ రామన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తెలుగు తమిళ చిత్రాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె సెప్టెంబర్ 9వ తేదీన ప్రియుడు, ఫిట్ నెస్, న్యూట్రిషన్ నిపుణుడు సంజయ్ ను పెళ్లి చేసుకొని మెట్టినింట అడుగు పెట్టిన సంగతి మనకు తెలిసిందే.

 Trending Actress Vidyullekha Raman Shares Her Wedding Photos-TeluguStop.com

పెళ్లి తర్వాత తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకోని విద్యుల్లేఖ తాజాగా తన పెళ్లికి ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానులను ఆకట్టుకున్నాయి.

ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు ఏమాత్రం హీరోయిన్ రేంజ్ కి తీసిపోలేదు అంటూ కామెంట్ చేస్తున్నారు.సెప్టెంబర్ 9వ తేదీ కేవలం బంధువులు సన్నిహితుల మధ్య తమిళ, సింధీ సాంప్రదాయాల ప్రకారం వీరి పెళ్లి ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది.

 Trending Actress Vidyullekha Raman Shares Her Wedding Photos-పెళ్లి ఫోటోలు షేర్ చేసిన విద్యుల్లేఖ రామన్.. హీరోయిన్ కి ఏ మాత్రం తగ్గని రేంజ్ లో-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రస్తుతం తన పెళ్లి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో అభిమానులు వీటిని వైరల్ చేస్తున్నారు.ముఖ్యంగా విద్యుల్లేఖ ఎరుపు రంగు లెహంగా ధరించి, సంజయ్ గోధుమరంగు శార్వాణి ధరించి ఉన్నటువంటి ఫోటో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

ప్రస్తుతం ఈ జంట హనీమూన్‌ కోసం మాల్దీవులకు వెళ్లారు.ఇక సినిమాల విషయానికొస్తే త్వరలోనే విద్యుల్లేఖ హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది.

#Vidyullekha

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు