`ఛ‌లో ప్రేమిద్దాం` మోష‌న్ పోస్ట‌ర్ కు ట్రెమండ‌స్ రెస్పాన్స్!!

హిమాల‌య స్టూడియో మేన్స‌న్స్ ప‌తాకంపై సాయి రోన‌క్‌, నేహ‌ సోలంకి హీరో హీరోయిన్లుగా సురేష్ శేఖ‌ర్ రేపల్లే ద‌ర్శ‌క‌త్వంలో ఉద‌య్ కిర‌ణ్‌ నిర్మిస్తోన్న చిత్రం `ఛ‌లో ప్రేమిద్దాం`.ఈ చిత్రం ఫ‌స్ట్ లుక్ అండ్ మోష‌న్ పోస్ట‌ర్ ఆవిష్క‌ర‌ణ ఇటీవ‌ల సెన్సేష‌న‌ల్ డైర‌క్ట‌ర్ గోపిచంద్ మ‌లినేని చేతుల మీదుగా జ‌రిగింది.

 Tremendous Response To The `let's Fall In Love` Motion Poster , Sai Ronak, Nehan-TeluguStop.com

విజువ‌ల్ ట్రీట్ తో పాటు సినిమా ఇంట్ర‌స్టింగ్ గా ఉండ‌బోతుందంటూ మేక‌ర్స్ మోష‌న్ పోస్ట‌ర్ తో చెప్ప‌క‌నే చెప్పారు.ఈ మోష‌న్ పోస్ట‌ర్ కు ప్రేక్ష‌కుల నుంచి, సినిమా ఇండ‌స్ట్రీ నుంచి అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌స్తోంది.

ఈ సంద‌ర్భంగా నిర్మాత మాట్లాడుతూ…“ఇటీవ‌ల విడుద‌ల చేసిన ఫ‌స్ట్ లుక్, మోష‌న్ పోస్ట‌ర్ కు అనూహ్య‌మైన స్పంద‌న వ‌స్తోంది.సినిమా పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.

త్వ‌ర‌లో సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసి సినిమాను గ్రాండ్ గా అతి త్వ‌ర‌లో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం“ అన్నారు.

డైర‌క్ట‌ర్ సురేష్ శేఖ‌ర్ రేప‌ల్లే మాట్లాడుతూ…“మా చిత్రానికి సంబంధించిన మోష‌న్ పోస్ట‌ర్, ఫ‌స్ట్ లుక్ కి అద్భుత‌మైన స్పంద‌న వ‌స్తోంది.

మోష‌న్ పోస్ట‌ర్ కాన్సెప్ట్, విజువ‌ల్స్ , బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుందంటున్నారు.సినిమా కూడా ఏమాత్రం ఆడియ‌న్స్ అంచ‌నాల‌కు త‌గ్గ‌కుండా ఉంటుంది.త్వ‌ర‌లో మా చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్ సింగిల్ లాంచ్ చేయ‌నున్నాం“ అన్నారు. శ‌శాంక్, సిజ్జు, అలీ, నాగినీడు, పోసాని కృష్ణ‌ముర‌ళి, ర‌ఘుబాబు, బాహుబ‌లి ప్ర‌భాక‌ర్‌, హేమ‌, ర‌ఘు కారుమంచి, సూర్య‌, తాగుబోతు ర‌మేష్‌, అనంత్ త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి సంగీతంః భీమ్స్ సిసిరోలియో ; పాట‌లుః సురేష్ గంగుల‌, దేవ్‌, ఎడిటింగ్ః ఉపేంద్ర జ‌క్క‌; ఆర్ట్ డైర‌క్ట‌ర్ః రామాంజ‌నేయులు; పీఆర్వోః ర‌మేష్ చందు, న‌గేష్ పెట్లు, ఫైట్స్ః న‌భా-సుబ్బు, కొరియోగ్ర‌ఫీః వెంక‌ట్ దీప్‌; సినిమాటోగ్ర‌ఫీః అజిత్ వి.రెడ్డి, జ‌య‌పాల్ రెడ్డి; నిర్మాతః ఉద‌య్ కిర‌ణ్‌, ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వంః సురేష్ శేఖ‌ర్ రేప‌ల్లె.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube