చలిని తట్టుకోవడానికి చెట్లకి స్వెట్టర్లు... ఆ దేశాల్లో సరికొత్త పద్ధతి

శీతాకాలంలో ఎలాంటి వారైనా చలికి తట్టుకోవడం కష్టం.ఇక శీతల దేశాలలో అయితే అర్ధరాత్రి నుంచి పడే మంచుకి బయట తిరగడం కూడా కష్టమే.

 Treesare Wearing Sweaters-TeluguStop.com

మంచు తుఫాన్ కూడా పడే దేశాలు ఉన్నాయి.అలాంటి దేశాలలో ఇంట్లో వేడి వాతావరణం పెట్టుకొని ప్రజలు జీవిస్తూ ఉంటారు.

ఇక సమశీతోష్ణ దేశం అయిన ఇండియాలో కూడా చలి తీవ్రత ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయితుంది.చలి తట్టుకోలేక కొత్త స్వెటర్ల కోసం మార్కెట్‌కు పరిగెడుతున్నాం.

ఇదిలా ఉంటే టర్కీ, బల్గేరియా దేశాలలో ప్రజలు కాస్తా కొత్తగా ప్రయత్నం చేస్తున్నారు.కొత్త స్వెటర్లు కొని రోడ్లకు ఇరువైపులా ఉండే చెట్లకు తొడుగుతున్నారు.

అసలు అలా చెట్లకి స్వెట్టర్లు తగిలించడం ఏంటి అనే అనుమానం ఎవరికైనా వస్తుంది.దేనికోసం వాళ్ళు అలా చేస్తున్నారు అనే విషయం తెలుసుకోవాలనే ఆసక్తి కూడా ఉంటుంది.

ఇంట్లో ఉన్న మనమే చలికి తట్టుకోలేక వణికిపోతూ ఉంటే మరి రోడ్లు మీద ఉన్న అనాధల పరిస్థితి ఏంటి అనే ఆలోచన అక్కడ ప్రజలు ఈ రకమైన సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.స్వెట్టర్లు చెట్లుకి తగిలించి ఉంచుతారు.

రోడ్డు మీద ఉండే అనాధలు ఎవరైనా వాటిని తీసుకొని వాడుకోవచ్చు.అలా చేయడం ద్వారా మనకి తెలియకుండానే వారి కష్టాన్ని తీర్చిన వాళ్ళం అవుతాం.

ఇదే అక్కడి ప్రజలని ఆకర్షించి అందరూ దీనిని ఫాలో అవుతున్నారు.రోడ్లు మీద పడుకునే అభాగ్యులకి చలికాలంలో తమ స్టైల్ లో సాయం చేస్తున్నారు.

వీటిని చూసి ముచ్చటపడిన భారతీయులు కూడా దీనిపై స్పందించారు.తాము కూడా ‘వాల్ ఆఫ్ కైండ్‌నెస్’ పేరుతో చేస్తున్న సేవా కార్యక్రమాల గొప్పగా ఉన్నాయని సోషల్ మీడియాలో పంచుకున్నారు.

ఇప్పుడు ఈ ఫోటోలో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube