చేసిది సీనియర్‌ అకౌంటెంట్‌ ఉద్యోగం... సంపాదన మాత్రం కోట్లలో అక్రమార్జన...!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ సర్కార్ మొదలైన తర్వాత రాష్ట్రంలో ఏ ఒక్క ప్రభుత్వ కార్యాలయంలో కూడా అవినీతి జరగకూడదని గట్టి వార్నింగ్ ఇచ్చిన కానీ, అధికారులలో మాత్రం ఎటువంటి మార్పు రావడం లేదు.ఇక అసలు విషయంలోకి వెళితే.

 Treasury Office Senior Accountant Manoj Kumar Corruption Case, Treasury Office S-TeluguStop.com

తాజాగా అనంతపురం జిల్లాలోని ట్రెజరీ కార్యాలయంలో సీనియర్ అకౌంటెంట్ గా పనిచేస్తున్న గాజుల మనోజ్ కుమార్ అవినీతి అనకొండగా మారాడు.

ఈయన అవినీతి తో ఏకంగా తన ఆస్తుల విలువ మూడు కోట్లకు పైగానే అక్రమార్జన పొందాడు.

ఇక ఈ విషయంలో మనోజ్ కుమార్ నమ్మిన బంటు తన కారు డ్రైవర్ నాగలింగ, అతని మామ అ బాలప్ప వారి ఇంట్లో ఏకంగా 8 ట్రంకు పెట్టెలలో తన ఆస్తిపాస్తులను దాచిపెట్టారు.ఇందుకు సంబంధించి మొదటగా మనోజ్ కుమార్ వద్ద మారణాయుధాలు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో.

దీనితో అనంతపూర్ జిల్లాలోని ముఖ్య పోలీస్ అధికారులు అందరూ రంగంలోకి దిగారు.ఈ నేపథ్యంలోనే మనోజ్ కుమార్ డ్రైవర్ నాగలింగం, అతని మామ బాలప్ప ఇళ్లలో తనిఖీలను కూడా చేశారు.

ఈ నేపథ్యంలోనే బాలప్ప ఇంట్లో ఏకంగా 8 ట్రంకు పెట్టెలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఇక ఆ ట్రంకు పెట్టె లని తెరిచి చూడగా అందులో ఏకంగా మూడు కోట్లకు పైగా విలువ చేసే నగదు, వెండి, బంగారం లాంటి విలువైన వస్తువులతో పాటు నాలుగు డమ్మీ పిస్టల్స్, 18 రౌండ్లు ఉన్న బుల్లెట్స్ ను స్వాధీనపరుచుకున్నారు పోలీసులు.ఈ తనికలలో 2.4 కేజీల బంగారం, 84.1 కేజీల వెండి, ఆపై 15 లక్షలకు పైగా నగదును, వీటితో పాటు 50 లక్షల విలువచేసే ఫిక్స్డ్ డిపాజిట్లు, 27 లక్షల సంబంధించి ప్రాంసరీ నోట్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Telugu Ananthapuram, Treasurysenior-Political

ఈ వివరాలను తెలిపిన పోలీసులు, ఆపై ఆ సొత్తును స్వాధీనం చేసుకుని, నిందితుడు మనోజ్ కుమార్ పై కేసు నమోదు చేసి రాష్ట్ర డిజిపి కి నివేదిస్తామని అని తెలియజేశారు.అలాగే ఈ కేసు సంబంధించి పూర్తి వివరాలను ఏసీబీకి అప్పగిస్తున్నట్లు తెలియజేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube