బంగారం కోసం సముద్ర తీరాన్ని జల్లెడపడుతున్న జనం.. ఎక్కడంటే?

సముద్ర తీరాల్లో నివసించే ప్రజలు ఇప్పుడే కాదు ఎప్పటి నుండో వజ్రాలు, బంగారం కోసం తమ వేటను కొనసాగిస్తూ ఉన్నారు.ఇలా చాలా ప్రాంతాల్లో ఈ గుప్త నిధుల కోసం ప్రజలు జల్లెడ పట్టి మరి వెతుకుతూనే ఉన్నారు.

 Treasure Hunters Strike It Rich On Uppada Coast, Andhra Pradesh, East Godavari,-TeluguStop.com

ఇలా వెతుకులాటలో కొంతమందికి వజ్రాలు దొరికితే మరికొంత మందికి బంగారం, వెండి నాణేలు దొరికిన సందర్బములు ఉన్నాయి.

ఇలా వజ్రాలు, బంగారం దొరికి ప్రజలు కోటీశ్వరులు, లక్షాది కారులు అయినా వారు ఉన్నారు.

అయితే ఈ వేటలో ఎక్కువ మంది ప్రజలకు నిరాశే ఎదురైంది.అందరికి అదృష్టం లభించదు.

కేవలం కొంత మందికి మాత్రమే ఇలాంటి అదృష్టం వరిస్తుంది.ఇక తాజాలో ఏపీలోని తీరప్రాంత ప్రజలు బంగారం కోసం సముద్ర తీరాల్లో జల్లెడ పట్టి మరి వెతుకు తున్నారు.

Telugu Andhra Pradesh, Godavari, Gold, Treasurehunters, Uppada, Uppada Coast-Lat

ఇక తాజాగా ఏపీ లోని ఉప్పాడ సముద్ర తీర ప్రాంతాల్లో బంగారం దొరుకుతుందని విన్న స్థానిక ప్రజలు గత రెండు రోజులుగా ఇక్కడ బంగారం కోసం వెతుకుతున్నారు.ఉదయం నుండి సాయంత్రం వరకు వీరి వేట కొనసాగుతూనే ఉంది.ఇక ఇప్పటికే ఇక్కడ కొంత మంది ప్రజలకు బంగారం దొరికిందట.దీంతో ఇక ప్రజలు తమకి కూడా దొరుకుతుందనే ఆశతో వెతుకులాట ప్రారంభించారు.

Telugu Andhra Pradesh, Godavari, Gold, Treasurehunters, Uppada, Uppada Coast-Lat

ఇక ఈ వేటలో చిన్నారులు సైతం ఉన్నారట.కొంతమంది ప్రజలకు ఇక్కడ బంగారం రేణువులు, చెవి దిద్దులు, ఉంగరాలు, రూపులు, కొన్ని వెండి వస్తువులు లభించాయట.ఇక ఈ విషయం తెలుసుకున్న ప్రజలు తెల్లారగానే వేట మొదలు పెడుతున్నారట.అయితే ఈ వస్తువులన్నీ గతంలోని రాజుల కోటలు, పలు దేవాలయాలు సముద్ర గర్భంలో కలిసి పోగా అవి ఇప్పుడు తుఫాన్ సమయంలో బయట పడుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube