సిగ్నల్ కోసం రోజూ ఐదు కిలోమీటర్ల ప్రయాణం.. ఓ చిన్నారి వ్యధ.. !

కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారని విన్నాం.అలాగే చదువుకోవాలనే తపన కష్టాన్ని కూడా మరిపిస్తుంది.

 Travel Five Kilometers Daily For Signal, Kumarambhim, Asifabad, Thiryanitravel,-TeluguStop.com

ఇక కష్టపడాలంటే వయస్సును చూస్తారు కొందరు.కానీ ఇప్పుడు మనం చదివే వార్త అందరిని ఆశ్చర్యపోయేలా చేస్తుంది.

ఇక వివరాల్లోకి వెళ్లితే.కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలం మర్రిగూడ లోని గిరిజన కుటుంబానికి చెందిన భగవంత రావు కూతురు సరస్వతి, ఈ చిన్నది మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతోంది.

కాగా సాక్షాత్తు చదువుల తల్లి పేరుతో పిలవబడుతున్న ఈ పాపకు చిన్నారికి చదువంటే అమితమైన ఇష్టం ఉందట.

కానీ కరోనా వల్ల తను చదివే పాఠశాలను మూసివేయడం వల్ల ఆన్లైన్లో పాఠాలు బోధిస్తున్నారు ఆ ఉపాధ్యాయులు.

ఈ క్రమంలో పూర్తిగా ఏజెన్సీ గ్రామమైన మర్రీగూడ లో మొబైల్ సిగ్నల్స్ అందవు దీంతో సరస్వతి చదువు కోసం ఈ చిన్నారి తండ్రి ప్రతిరోజూ ఐదు కిలోమీటర్ల దూరంలో సిగ్నల్ వచ్చే ప్రాంతానికి బైక్ పై తీసుకెళ్ళి ఆన్‌లైన్ పాఠాలు వినిపించి తిరిగి ఇంటికి తీసుకురావడం అనే బాధ్యత ను తీసుకున్నారట.

ఇక ఈ చిన్నారికి చదువుపట్ల ఉన్న ఆసక్తిని గమనించిన విద్యా భారతి విద్యా సంస్థల యాజమాన్యం తో పాటు ట్రాస్మా సభ్యులు సరస్వతి చదివి నంత కాలం ఉచిత విద్యను అందించడం తో పాటు ఒక ట్యాబ్ ను కూడా ఇస్తామని మాట ఇచ్చారట.

చూసారా మనిషిలోని తపన దేన్నైనా సాధించేలా చేస్తుందని ఈ చిన్నారి నిరూపించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube