ఈ-పాస్ ద్వారానే రవాణా సదుపాయం.. ఎలా అప్లై చేయాలంటే..?

రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ సర్కార్ లాక్ డౌన్ అమలు చేసింది.పదిరోజుల పాటు కఠిన లాక్ డౌన్ విధించింది.

 Transport Facility Through E-pass .. How To Apply E Pass, Tranporation, Telanga-TeluguStop.com

ఈ సందర్భంగా వేరే రాష్ట్రాలకూ, ఇతర జిల్లాలకు వెళ్లే వారికి ఈ-పాస్ విధానం ద్వారా ప్రత్యేక పాసులు అందచేయనున్నట్లు డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి మంగళవారం వెల్లడించారు.అత్యవసర పరిస్థితుల్లో అందచేసే ఈ- పాస్ లకు గాను https://policeportal.tspolice.gov.in/ అనే వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణ రాష్ట్రానికి వచ్చే వారికి మాత్రం సంబంధిత రాష్ట్రాల నుంచే పాస్‌లు జారీ చేయనున్నారు.లాక్ డౌన్ సడలింపు సమయమైన ఉదయం ఆరు గంటలనుండి 10 గంటల లోపు ప్రయాణించే వారికి ఏవిధమైన పాసులు అవసరం లేదని, అయితే దరఖాస్తు చేసుకునే వారు వెబ్‌సైట్ ద్వారానే చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.తెలంగాణకు వెళ్లాలనుకునేవారు తప్పనిసరిగా ఈపాస్ ను కలిగి ఉండాలి.

ఈ పాస్ ను ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుందాం.

ముందుగా దరఖాస్తు చేయడానికి తెలంగాణ పోలీస్ అధికారిక వెబ్‌సైట్ లో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.

అందుకోసం వారు వెబ్ సైట్ ను ఇచ్చారు.https://policeportal.tspolice.gov.in/ లో లాగిన్ అవ్వాలి.

ఆ తర్వాత అందులో కనిపించే ఈ పాస్ e-Pass పై క్లిక్ చేయాల్సి ఉంటుంది.ఇక అందులో మీరు ఏ ప్రాంతంలో ఉన్న జిల్లా/కమిషనరేట్‌ను ఎంపిక చేసుకోవాలి.

ఆ తర్వాత అక్కడ ఇచ్చిన కొన్ని వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.పేరు, ఆధార్ నెంబర్, వాహనం, ఎంతమంది, పాస్ ఎందుకు, ఏ పర్పస్ కోసం, ఫోన్ నెంబర్లు, మీరు వెళ్లాల్సిన పోలీస్ స్టేషన్ పరిధి, డిస్టెన్స్, తదితర వివరాలను నింపాల్సి ఉంటుంది.

దానితో పాటుగా ఫొటో, పర్పస్ డాక్యుమెంట్, కేవైసీ ఫారమ్ లను తప్పకుండా అప్‌లోడ్ చేయాలి.ఆ తర్వాత కర్ఫర్మేషన్ అనేది వస్తుంది.

ఇక ఆయా పరిధుల్లోని కమిషనరేట్, ఎస్పీల నుంచి ఈ పాస్ మంజూరవుతుంది.ఆ పాస్ ను చూపించి ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube