హిజ్రాల అయ్యప్ప దీక్ష.. గుడిలోకి వెళ్లేందుకు ఓకే కాని, ఆ డ్రస్‌లోనే రావాలంటున్న దేవాలయ కమిటి

శబరిమల అయ్యప్పను దర్శించేందుకు మహిళలకు అవకాశం లేదనే విషయం తెల్సిందే.10 సంవత్సరాలు దాటిన వారి నుండి 60 ఏళ్ల వారి వరకు శబరిమల వెళ్లేందుకు అవకాశం లేదు.అయితే ఈమద్య సుప్రీం కోర్టు అందరికి కూడా శబరిమల ప్రవేశం ఇవ్వాల్సిందే అంటూ కేరళ ప్రభుత్వంను మరియు దేవాలయ అధికారులను ఆదేశించిన విషయం తెల్సిందే.దాంతో శబరిమల కొండకు వెళ్లేందుకు ఆడవారు ఆసక్తి చూపుతున్నారు.

కొందరు శబరిమల కొండ కూడా ఎక్కారు.కాని భక్తులు ప్రతిఘటించడంతో వారు వెనుదిరిగారు.

ఆడవారికి అయితే ఛాన్స్‌ లేదు, కాని హిజ్రాల పరిస్థితి ఏంటీ అనేది ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది.తాజాగా నలుగురు హిజ్రాలు అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు.కాని వారిని అడ్డుకున్న పోలీసులు మరియు అధికారులు మీకు అనుమతి లేదు అంటూ వెనక్కు పంపించారు.తాము మండల కాలంగా దీక్షను పూని ఎంతో నిష్టగా అయ్యప్పను కొలిచి ఇరుముడి కట్టుకుని దేవుడిని చూసేందుకు వస్తే ఇలా అవమానిస్తారా అంటూ కన్నీరు పెట్టుకున్నారు.

వారి ఆందోళన ఆలయ పెద్ద వరకు వెళ్లడంతో వారిని అనుమతించేందుకు ఓకే చెప్పారు.అయితే అందుకు చిన్న కండీషన్‌ను సదరు ఆలయ సిబ్బంది పెట్టారు.ఆడవారి మాదిరిగా చీరల్లో కాకుండా, మగ వారి మాదిరిగా నల్ల డ్రస్‌లలో రావాలని ఆదేశించింది.కాని హిజ్రాలు మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదు.

డ్రస్‌లో ఏముంది అంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కాలం ఇంతగా మారుతున్న ఈ సమయంలో హిజ్రాలను మరీ ఇంత దారుణంగా అవమానిస్తారా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మా ఏడుపు మీకు మంచిది కాదని ఆలయ అధికారులను హిజ్రాలు హెచ్చరించారు.హిజ్రాలను అనుమతిస్తే ఆ తర్వాత మహిళలు కూడా వస్తారు, వారిని అనుమతించవద్దు అంటూ భక్తులు కోరుతున్నారు.

ఆ నలుగురు హిజ్రాలు మాత్రం దర్శనం కోసం అక్కడే వేచి చూస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube