దేశంలో తొలి ట్రాన్స్ జెండర్ నర్స్ గా అన్బు రుబీ

ఈ మధ్య కాలంలో ఆడవాళ్ళు, మగవారితో పాటు ట్రాన్స్ జెండర్స్ కూడా తమ హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు.వారికి కూడా అందరితో పాటు తమకి ఉద్యోగాలతో పాటు అన్ని రంగాలలో సమాన అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

 Transgender Woman Gets Appointed As Nurse-TeluguStop.com

దానికి తగ్గట్లే ప్రభుత్వాలు కూడా వారిని కూడా థర్డ్ జెండర్ గా గుర్తించి చట్టం తీసుకొచ్చింది.ఆ మధ్య కాలంలో ఓ ట్రాన్స్ జెండర్ మహిళ న్యాయస్థానంతో పోరాటం చేసి ఎస్సై ఉద్యోగం సంపాదించుకుంది.

ఇప్పుడు తాజాగా మరో ట్రాన్స్ జెండర్ ఇండియాలో మొట్టమొదటి ట్రాన్స్ జెండర్ నర్స్ గా ఉద్యోగంలో చేరింది.

తమిళనాడు ఆరోగ్య, సంక్షేమ శాఖ చరిత్రలో అన్బు రుబీ అనే టాన్స్‌జెండర్ మహిళ నర్సు ఉద్యోగం సొంతం చేసుకుంది.

ఇందుకు సంబంధించిన నియామక ఉత్తర్వులను తాజాగా ఆమె అందుకుంది.ముఖ్యమంత్రి కె.పళనిస్వామి, ఆరోగ్య శాఖ మంత్రి సి.విజయభాస్కర్ నుంచి ఈ నియామక ఉత్తర్వులు జారీ అయ్యాయి.కొత్త నియామకాల్లో భాగంగా 5,224 మందికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయగా, వారిలో అన్బు రూబీ కూడా ఉంది.దీనిపై మంత్రి విజయభాస్కర్ మాట్లాడుతూ, ఆరోగ్య, సంక్షేమ శాఖ చరిత్రలోనే తొలిసారిగా ఒక ట్రాన్స్‌జెండర్‌ను నర్సుగా నియమించామని, ఇది యావత్ రాష్ట్రం గర్వించదగిన విషయమని అన్నారు.

దీనిపై అన్బు కూడా తన ఆనందం వ్యక్తం చేసింది

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube