రూ.50 లక్షలు గెలిస్తే నేను అమ్మనవుతా.. ట్రాన్స్ జెండర్ ప్రియాంక కామెంట్స్ వైరల్?

Transgender Priyanka Comments Viral On Bigg Boss House

ఇప్పటివరకూ బిగ్ బాస్ హౌస్ లో విజేత కు 50 లక్షలు ప్రైజ్ మనీ మాత్రమే ఇచ్చేవారు.అయితే ఈ సీజన్ లో మాత్రం 50 లక్షలతో పాటు, అదనంగా ఇల్లు కట్టుకోవడానికి అనుకూలమైన భూమిని కూడా కానుకగా అందిస్తున్నారు.

 Transgender Priyanka Comments Viral On Bigg Boss House-TeluguStop.com

ఇక ఇదే విషయాన్ని బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున అధికారికంగా ప్రకటించడం జరిగింది.బిగ్ బాస్ విన్నర్ కు 50 లక్షలతో పాటు, షాద్ నగర్ లో సువర్ణ కుటీర్ లో 25 లక్షలు విలువైన 300 చదరపు గజాల స్థలాన్ని సైతం ఇస్తున్నట్లు తెలిపారు.

ఇక తాజాగా హౌస్ లోని కుటుంబ సభ్యులకు ఒకవేళ ప్రైజ్ మని గెలిస్తే ఆ డబ్బుతో ఎవరెవరు ఏం చేస్తారో చెప్పాలని హౌస్ మేట్స్ ను ఆదేశించాడు నాగార్జున.మొదట ప్రియాంక మాట్లాడుతూ.

 Transgender Priyanka Comments Viral On Bigg Boss House-రూ.50 లక్షలు గెలిస్తే నేను అమ్మనవుతా.. ట్రాన్స్ జెండర్ ప్రియాంక కామెంట్స్ వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తాను గనుక 50లక్షలు గెలుచుకుంటే తల్లిదండ్రుల కోసం ఇల్లు కొంటానని, అదే విధంగా తనకు చిన్నప్పటి నుంచి అమ్మ అని పిలిపించుకోవాలని కోరిక ఉండేదని, దత్తత తీసుకోవాలంటే బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి అన్నారు కాబట్టి ఈ ప్రైజ్ మనీతో ఒక అమ్మాయిని దత్తత తీసుకుంటానని తెలిపింది.

అనంతరం యాంకర్ రవి తనకు 50 లక్షలు వస్తే అందులో సగం డబ్బు తన కూతురు వియా చదువు కోసం ఖర్చు పెడతాను అని తెలిపారు.

Telugu Rupees, Anchor Ravi, Bigg Boss Prize, Nagarjuna, Priyanka, Sri Ram, Trans Gender-Movie

నిర్మాణ సంస్థ నెలకొల్పాలి అన్న కోరికను నెరవేర్చుకుంటానని తెలిపారు.అనంతరం శ్రీరామ్ మాట్లాడుతూ తెలుగు ప్రేక్షకులకు దగ్గర అవ్వాలని వచ్చాను.పెద్ద ఇల్లు కట్టి పేరెంట్స్ తో ఉండాలి అన్నది నా కోరిక అని చెప్పుకొచ్చాడు.ఇలా హౌస్ లోని కంటెస్టెంట్ లు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తమ తమ కోరికలను బయటపెట్టారు.

కానీ ప్రియాంక మాత్రం తాను అమ్మ అనిపించుకోవడం కోసం ఆ డబ్బును ఖర్చు చేస్తానని తెలిపారు.

#Anchor Ravi #Trans Gender #Priyanka #Rupees #Nagarjuna

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube