రసవత్తరంగా సాగుతున్న బిగ్‌బాస్ షోలో రోజుకో సంఘటన హైలెట్‌గా నిలుస్తోంది.ఇటీవలే మూడో వారానికి నామినేషన్ ప్రక్రియ ముగిసింది.
అంతే కాకుండా అమెరికా అబ్బాయి హైదరాబాద్ అమ్మాయి అనే టాస్కుతో షో కాస్త బోరింగ్‌గానే జరిగింది.అనంతరం జెస్సీ వచ్చే వారానికి కెప్టెన్ అయ్యాడు.
ఇక తాజాగా జరిగిన ఎపిసోడ్లో బెస్ట్ కంటెస్టెంట్, వరెస్ట్ కంటెస్టెంట్ ఎవరో తేల్చాలని బిగ్‌బాస్ ఆదేశించారు.దాంతో ఇంట్లో మళ్లీ గొడవలు మొదలైనట్టున్నాయి.
19వ రోజుకు చేరుకున్న బిగ్ బాస్ షోలో కొన్ని ఎమోషనల్, మరికొన్ని గొడవలతో కూడిన సన్నివేశాలు జరిగాయి.కాగా సిరి, షన్ను, జెస్సీ అర్దరాత్రి మాట్లాడుకుంటుండగా.
నువ్వు మాట్లాడకపోతే ఏదోలా ఉంద ని షన్నుతో సిరి తన బాధను చెప్పుకొని బాధపడుతుంది.అయితే బాధపడు అని షన్ను కౌంటర్ వేశాడు.
నువ్వు టైం ఇవ్వడం లేదని, వేరే వాళ్లతో ఉంటున్నాను వేరే వాళ్లతో ఫ్రెండ్ షిప్ చేస్తున్నాను అని సిరి చెప్పింది.మంచిదే కదా? అని షన్ను అన్నాడు.
ఇదిలా ఉండగా మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ సమయంలో శ్వేతా వర్మ రచ్చ చేసింది.తనను కిచెన్ వర్క్ చేయనివ్వడం లేదని వాపోతుంది.అందరికీ వంట రావాలని, అందరూ వంట చేయాలని చెప్పుకొచ్చింది.ఆ తరువాత హమీద, మానస్ విషయం లైన్లోకి వచ్చింది. ఈ మధ్య లహరి అర్థం కావడం లేదు.ఎక్కువగా పొసెసివ్ అయినట్టు కనిపిస్తోందిని హమీదకు గోరు ముద్దలు తినిపిస్తూ మానస్ అంటాడు.
ఆ రోజు చపాతి తినిపించిన ఘటన అంటూ హమీదకు గుర్తు చేస్తాడు మానస్.నువ్వు అడిగావు కదా? లహరికి చెప్పాను.డైనింగ్ టేబుల్ వద్దకు వస్తే.నీకు, హమీదకు తినిపిస్తాను అని చెబితే.రానంది.ఇక్కడే ఉండి.
ఇంకో చపాతి తినిపించాలని పట్టుబట్టింది అంటూ లహరి చేసిన వ్యాఖ్యల గురించి హమీదకు మానస్ చెప్తాడు.
ఇక లగ్జరీ బడ్జెట్ టాస్క్ అయిన అతికిందంటే అదృష్టమే అనే టాస్క్‌లో హౌజ్ సభ్యులంతా మరోసారి తామేంటో నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తారు.ఆ టాస్క్‌లో ఇంటి సభ్యులంతా కలిసి వరెస్ట్ పర్ఫామర్‌గా మానస్ పేరును బిగ్‌బాస్‌కు చెప్తారు.దీంతో మానస్ జైల్లో పడతాడు.
అయితే హమీదకు గోరు ముద్దలు తినిపించడంపై ప్రియాంక కొంచెం ఫీలైనట్టు తెలుస్తోంది.ఇప్పుడు నువ్వు జైల్లో ఉన్నావు కదా? హమీదకు ఎవరు తినిపిస్తారు? అని మానస్‌పై ప్రియాంక సెటైర్ వేస్తుంది.నేను ఎక్కువగా జెలసీ ఫీల్ అవుతాను.అది పట్టించుకోకు.
అలాపూర్తిగా పట్టించుకోకుండా కూడా ఉండకు” అని మానస్‌కు తన మనసులోని మాట చెప్పేస్తుంది ప్రియాంక సింగ్.చివరకు శ్రీరామచంద్రకు రాఖీ కడతాను.
కానీ నీకు మాత్రం కట్టనని మానస్ పై ఉన్న ప్రేమను ప్రియాంక కరాఖండిగా చెప్పేస్తుంది.