ట్రాన్స్‌ జెండర్‌ కష్టపడి పోలీస్‌ జాబ్‌ కొట్టింది, వేదింపులతో ఆత్మహత్యకు యత్నం.. సెల్ఫీ వీడియోలో సంచలన విషయాలు చెప్పింది   Transgender Nazriya Gets A Police Officer     2018-12-05   13:14:52  IST  Ramesh P

మన సమాజంలో ట్రాన్స్‌ జెండర్‌లకు తీవ్రమైన అనుమానాలు ఎదురవుతూ ఉంటాయి. వారు జీవించడమే కష్టం అవుతుంది. ఎవరో కొందరు మాత్రం మొండిగా బతికేస్తున్నారు. తమిళనాడుకు చెందిన నస్రియా అనే ట్రాన్స్‌ జెండర్‌ మొదటి నుండి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసింది. ఎన్ని అవమానాలు ఎదురైనా, అడ్డంకులు వచ్చినా కూడా కష్టపడి చదవింది.

తన కల అయిన పోలీస్‌ జాబ్‌ను సంపాదించింది. అందరిని ఆశ్చర్యపర్చుతూ పోలీసు శాఖలో జబ్‌ సంపాదించిన నస్రియా ఇక నిశ్చింతగా జీవితాన్ని గడిపేయవచ్చు అని భావించింది. కాని అనూహ్యంగా ఆమెకు మళ్లీ వేదింపులు మొదలు అయ్యాయి.

Transgender Nazriya Gets A Police Officer-Transgender Viral News About

నస్రియాకు ఏఆర్‌ విభాగంలో పోలీసు ఉన్నతాధికారులు బాధ్యతలు ఇవ్వడం జరిగింది. అయితే నస్రియా పై అధికారులు పదే పదే ఆమెను క్రమశిక్షణ లేదు అంటూ తిట్టేవారట. దాంతో ఆమె తీవ్ర మనస్థాపంకు గురయ్యింది. తాను ట్రాన్స్‌ జెండర్‌ అవ్వడం వల్లే వారు టార్గెట్‌ చేస్తున్నారన్న విషయం ఆమెకు అర్థం అయ్యింది. ఆమె అవమానాలను భరించలేక పోయింది. తోటి వారి ముందు తనను నీచంగా మాట్లాడటం, నన్ను మూడో వ్యక్తిగా ట్రీట్‌ చేయడం వంటివి చేయడంతో ఆమెకు తీవ్రమైన దుఖ: వచ్చిందట. ఆ కారణంగానే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది.

Transgender Nazriya Gets A Police Officer-Transgender Viral News About

ఆత్మహత్య చేసుకునే ముందు ఒక సెల్ఫీ వీడియోను తీసుకుని అందులో తనను వేదించిన ఉన్నతాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తనలాంటి వారు ఈ భూమి మీద ఉండ వద్దు అనేది వారి అభిప్రాయం కావచ్చు. అందుకే నన్ను ఇంతగా హింసించారు. నాలా ఇంకా ఎంతో మంది ఇలాంటి బాధలు అనుభవిస్తున్నారు నాకు తెలుసు. అందుకే వారిని అయినా మనుషుల్లా చూడండి అంది. తన చావుకు పూర్తి బాధ్యత వారిదే అంటూ వాంగ్మూలం ఇచ్చి మరీ మందు కలిపిన వాటర్‌ను తాగేసింది. అయితే నస్రియా విషయం తెలుసుకున్న సన్నిహితులు వెంటనే ఆమెను హాస్పిటల్‌కు తరలించారు.

Transgender Nazriya Gets A Police Officer-Transgender Viral News About

దాంతో ఆమె ప్రాణాపాయ స్థితి నుండి బయట పడటం జరిగింది. నస్రియా విషయమై తమిళనాడు పోలీస్‌ బాస్‌లు స్పందించారు. ఆమెను వేదించిన వారిని కఠినంగా శిక్షిస్తాం అంటూ హామీ ఇచ్చారు. నస్రియ ఆత్మహత్య యత్నం వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఆ వీడియోను మీరు ఒక లుక్కేయండి. ఈ వీడియో కోసం క్లిక్ చేయండి

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.