మగవారి అందాల పోటీలలో హిజ్రా! అతని అందం చూస్తే అమ్మాయిలు పిచ్చెక్కి పోతారు

కొంత మంది ఆడవారిలో పురుష లక్షణాలు, కొంత మంది మగవారిలో స్ట్రీ లక్షణాలు ఉండటం సహజంగా జరుగుతుంది.అలాంటి వారు తరువాత కాలంలో లింగ మార్పిడి చేసుకొని పూర్తిగా ఆడవారిగా లేదా మగవారిగా మారిపోతారు.

 Transgender Man Is The First To Compete In A State Pageant In Brazil-TeluguStop.com

ఇలా మారిపోయిన వారిలో ప్రముఖులు కూడా కనిపిస్తూ ఉంటారు.కొంత మంది గ్లామర్ ఇండస్ట్రీలో రాణిస్తున్న వారు కూడా ఉన్నారు.

బేసిక్ గా వీళ్ళని ట్రాన్స్ జెండర్స్ అంటారు.అయితే అందం, ఆకర్షణలో ఆడవారు, మగవారికి ఏ మాత్రం తీసిపోకుండా ఉండే వీళ్ళు అందరిలో ఒకరుగా ఉంటారు.

ఇదిలా ఉంటే చాలా మంది అమ్మాయిలుగా మారిన అబ్బాయిలు తమ అందంతో ప్రపంచ ద్రుష్టిని ఆకర్షించిన వారు ఉన్నారు.కాని అబ్బాయిగా మారిన అమ్మాయిలలో చాలా తక్కువ మంది ఫేమస్ అవుతారు.

పుట్టుకతో స్త్రీ అయిన 23 ఏళ్ల బెర్నార్డో రిబేరో లింగమార్పిడి చేయించుకుని పురుషుడిగా మారారు.ప్రస్తుతం బ్రెజిల్‌లో జరుగనున్న మిస్టర్‌ బ్రెజిల్‌ అందాల పోటీలకు అతను ఎంపికయ్యాడు.

లింగమార్పిడి చేయించుకున్నా మిస్టర్‌ బ్రెజిల్‌ టైటిల్‌ సాధించడమే తన కల అంటూ అతను చెబుతున్నాడు.ఇతను ప్రస్తుతం మోడల్ గా బ్రెజిల్ లో చాలా ఫేమస్.

స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణిస్తూ బ్రెజిల్‌ చట్టం చేసింది.ఈ చట్టం ఉనికిలోకి వచ్చిన వారంలోపే బెర్నార్డో పోటీ విషయం బయటికి రావడం విశేషం.

మరి ఈ మిస్టర్ బ్రెజిల్ లో గెలిచి ఈ కుర్రాడు అమ్మాయిల కలల రాకుమారుడుగా మారుతాడో లేదో వేచి చూడాలి.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube