పాపం.. ప్రేమ పేరుతో ఆమెను వాడుకొని పిల్లలు కనలేదని నడిరోడ్డుపై వదిలేశాడట!

Transgender Actress Harshini Reveals About Her Love Story

ప్రేమనేది రెండు మనసులకు సంబంధించింది.అమ్మా నాన్న చనిపోయినపుడు ఆ డిప్రెషన్‌లో ఉన్నపుడు ఒకతను పరిచయం అయ్యాడని ట్రాన్స్‌జెండర్ నటి హర్షిణి తెలిపారు.

 Transgender Actress Harshini Reveals About Her Love Story-TeluguStop.com

అయితే ట్రాన్స్ జెండర్స్‌ ఎంతోమందిని ప్రేమించడం, కొంత కాలం వరకు వాళ్లతో జర్నీ చేయడం, ఆ తర్వాత నడిరోడ్డుపై వదిలేసేసి, పిల్లలు పుట్టరన్న ఒకే ఒక్క కారణంతో వదిలేసి వెళ్లిపోయి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని వెళ్లిపోతారని ఆమె అన్నారు.అసలు వాళ్ల లైఫ్ ఏమైపోతుందంటే చాలా మంది కుటుంబం నుంచి వేరుగా వచ్చి కమ్యూనిటీలో ఒంటిరిగా బతుకుతారు.

ఆ సమయంలో ఒక అబ్బాయి వచ్చి అతనే ప్రపంచంగా నమ్మించేసి, ఒక రకమైన అఫెక్షన్ చూపించి, తానే ప్రపంచం అనేంతగా ప్రేమను చూపించి, అ తర్వాత నడిరోడ్డుపై వదిలేసి వెళ్లిపోతారని హర్షణి వాపోయారు.అప్పుడు ఆ ట్రాన్స్‌జెండర్స్ చాలా మంది పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందని, సుసైడ్ చేసుకొని చనిపోయిన వాళ్లు చాలా మంది ఉన్నారని ఆమె చెప్పుకొచ్చారు.

 Transgender Actress Harshini Reveals About Her Love Story-పాపం.. ప్రేమ పేరుతో ఆమెను వాడుకొని పిల్లలు కనలేదని నడిరోడ్డుపై వదిలేశాడట-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇకపోతే తాను ట్రాన్స్‌జెండర్స్ ఎన్‌జీవోలో పనిచేసేటపుడు వాళ్లకు కౌన్సిలింగ్ చేసేదాన్ని అని నటి హర్షిణి అన్నారు.ఎందుకు చనిపోతున్నారు.ఎందుకు ఈ డిఫ్రెషన్‌లో ఉన్నారు, ఎందుకు వాళ్లు డ్రింక్ చేస్తారు, ఇలాంటి వాటిపై వాళ్లకు కౌన్సిలింగ్ ఇస్తున్నపుడు బయటపడ్డ విషయాలేమిటంటే, వాళ్లు ఆ డిఫ్రెషన్ నుంచి బయటికి రాలేకపోతారని, కాబట్టి తాను మాత్రం అలాంటి డిఫ్రెషన్‌లోకి ఎప్పుడూ వెళ్లొద్దని అనుకున్నాని, కానీ లైఫ్ ఎప్పుడు, ఎలా మారుతుందో చెప్పలేం కదా అని ఆమె వివరించారు.

Telugu Boyfriend Cheated, Love Brakeup, Tollywood, Transgender Actress Harshini-Movie

ఇదిలా ఉండగా ఒకబ్బాయి తనకు మొదట ఫ్రెండ్‌గా పరిచయం అయ్యాడని, తనపై చాలా కేరింగ్ చూపించేవాడని హర్షిణి చెప్పారు.తనకు తన అమ్మ అంటే చాలా ఇష్టమన్న ఆమె, అప్పుడప్పుడు గుర్తుకువచ్చి తాను ఏడుస్తానని ఆమె చెప్పుకొచ్చారు.అలా అమ్మ గుర్తొచ్చినపుడు తాను మీ అమ్మ నిన్ను ఓదార్చడానికి నన్ను పంపించిందని అతను ఫ్లర్ట్ చేసేవాడంటూ ఆమె తెలిపారు.

కానీ అతను తనను నిజంగానే లవ్ చేశాడని తనకు అర్థమయ్యిందని హర్షిణి తెలిపారు.అలా మా మధ్య కొంత కాలం వరకు ఆ రిలేషన్‌షిఫ్ కొనసాగిందని ఆమె చెప్పారు.

తాను ముంబైలో జాబ్ చేస్తున్నపుడు తనకోసం అక్కడివరకు వచ్చేసేవాడని ఆమెను అన్నారు.అదంతా చూసి తనంటే ఆమెకు చాలా ఇష్టం ఏర్పందని ఆమె అన్నారు.

Telugu Boyfriend Cheated, Love Brakeup, Tollywood, Transgender Actress Harshini-Movie

ఇక తనకు పిల్లలు పుట్టరని తెలిసినా టెస్ట్ ట్యూబ్ ద్వారా పిల్లల్ని కందాము, పెళ్లి చేసుకుందామని తానకు ఆతను చెప్పినట్టు హర్షిణి తెలిపారు.ఇక కొన్ని రోజులు గడిచాక అతని ప్రవర్తనలో వచ్చిన మార్పును గమనించి తన ఫ్రెండ్స్ ద్వారా అసలు విషయాన్ని తాను తెలుసుకున్నట్టు ఆమె చెప్పారు.అతనికి పెళ్లి సెటిల్ అయ్యిందని తన ఫ్రెండ్స్ చెప్పడంతో అతన్నే నేరుగా ఆ విషయం అడగడంతో అవును అది నిజమే కానీ, తనను చేసుకుంటాను, నిన్ను కూడా పెళ్లి చేసుకుంటానని ఆ అబ్బాయి చెప్పాడని ఆమె వివరించారు.ఆ మధ్యలో అప్పుడు కొంచెం ఫిజికల్ హరాస్‌మెంట్ కూడా జరిగిందని ఆమె అన్నారు.

ఆ తర్వాత తాను ముంబై వెళ్లిపోయానని చాలా డిఫ్రెషన్‌లోకి వెళ్లానన్న ఆమె, కొన్ని రోజుల తర్వాత అతనికి పెళ్లయిపోయి ఒక బాబు కూడా ఉన్నాడని తనకు తెలిసినట్టు ఆమె చెప్పారు.

ఆ తర్వాత ఈ మధ్య మళ్లీ తనకు మెసెంజర్‌లో మెసేజ్‌ చేశాడని, నువ్వు లేకుండా ఉండలేకపోతున్నానంటూ చేసిన మెసెజ్‌లను చూసి తనకు నవ్వొచ్చిందన్న ఆమె, కానీ తాను మాత్రం నీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండు అని బ్లాక్ చేసినట్టు ఆమె చెప్పుకొచ్చారు.

#Boyfriend #Love Brakeup

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube