ఆడిషన్ లో కమిట్మెంట్ ఇస్తేనే పాత్ర ఇస్తా అన్నారు.. ట్రాన్సజెండర్ షాకింగ్ రివిలేషన్?

Transgender Actress Harshini Open Ups About Casting Couch Experience In Tollywood

సాధారణంగా సమాజంలో ట్రాన్స్జెండర్స్ అంటే చులకన భావన ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే.ఇకపోతే సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రావాలంటే తప్పకుండా కమిట్మెంట్ ఇవ్వాలని ఎంతో మంది హీరోయిన్లను కమిట్మెంట్ అడిగినవారు ఉన్నారని ఈ సందర్భంగా పలువురు ఎన్నోసార్లు తెలియజేశారు.

 Transgender Actress Harshini Open Ups About Casting Couch Experience In Tollywood-TeluguStop.com

అయితే సినిమా అవకాశాల కోసం ఏకంగా ఒక ట్రాన్స్ జెండర్ ని కూడా కమిట్మెంట్ అడిగారని తాజాగా ట్రాన్స్జెండర్ తన విషయంలో జరిగిన షాకింగ్ నిజాలు బయటపెట్టారు.

ఈ సందర్భంగా ట్రాన్స్జెండర్ హర్షిని మాట్లాడుతూ… సినిమా షూటింగ్స్‌లో తాను ట్రాన్స్‌జెండర్‌ అనే భావంపై ఎదుర్కొన్న సంఘటనలు చాలా తక్కువే అని నటి హర్షిణి చెప్పుకొచ్చారు.

 Transgender Actress Harshini Open Ups About Casting Couch Experience In Tollywood-ఆడిషన్ లో కమిట్మెంట్ ఇస్తేనే పాత్ర ఇస్తా అన్నారు.. ట్రాన్సజెండర్ షాకింగ్ రివిలేషన్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇప్పటివరకు తాను చేసిన వెబ్‌ సిరీస్‌లలో, ఇంకా వేరే వాటిల్లో తాను ట్రాన్స్ జెండర్ అని అందరికీ తెలుసు.కాబట్టి వారంతా తనకు చాలా ప్రోత్సహించేవారని, సహాయం చేసేవారని ఆమె స్పష్టం చేశారు.

అమన్ అహ్మద్ గారు డైరెక్టర్ థియేటర్ షోస్ ఆయన తనకు యాక్టింగ్ ఎలా చేయాలో మెళకువలు నేర్పించారని, అక్కడ తాను ఎలాంటి ఇబ్బందులూ ఎదుర్కోలేదని ఆమె అన్నారు.

ఇకపోతే ఒక మూవీలో చేస్తున్నపుడు మాత్రం చుట్టుపక్కల ఉండే ఒక అబ్బాయి తనని గుర్తుపట్టి, తాను ట్రాన్స్ జెండర్ అని అందరికీ ప్రచారం చేశాడని హర్షిణి చెప్పుకొచ్చారు.

దాంతో అక్కడివారంతా తన గురించి ఏవో ఏవో గుసగుసలాడుకున్నారని, అప్పుడు తనకు బాధగా అనిపించిందని మాత్రం ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

Telugu Acting, Casting Couch, Casting Couch In Tollywood, Commitments, Movies, Shocking Relation, Talent, Tollywood, Transgender Actress Harshini, Transgender Harshini-Movie

ఎందుకు ట్రాన్స్ జెండర్ అయినంత మాత్రంగా ఎందుకలా గుసగుసలాడుకోవాలి ? తాను కూడా అందరిలానే కదా ? తాను కూడా అందరితోపాటు యాక్టింగ్ చేయడానికి వచ్చాను కదా ? అని ఆమె వాపోయారు.ఒకవేళ అంతగా మాట్లాడుకోవాలనిపిస్తే డైరెక్టుగా తన దగ్గరికే వచ్చి మేడమ్ మీరు ట్రాన్స్ జెండరా ? అని అడగొచ్చు కదా అని ఆమె అన్నారు.అలా చేసి ఉంటే నిజంగా తాను సంతోషంగా ఫీల్ అయ్యేదాన్ని అని ఆమె చెప్పారు.

దానికి తన గురించి అలా మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముంది ? అని కొంచెం బాధేసింది అంటూ ఆమె తన ఆవేదనను వెల్లగక్కారు.

ఇదిలా ఉండగా, ఒక శారీరక సుఖం కోసం అబ్బాయిలు ఎంత దారుణానికి దిగజారుతున్నారంటే, ఈ మధ్య కాలంలో జరిగిన ఒక వార్తను ఉదాహరణగా వివరించారు నటి హర్షిణి.

ఒక 6 ఏళ్ల పాపను అలా చేయడం అనేది నిజంగా దారుణమన్న ఆమె, ఈ సొసైటీ ఎప్పుడు మారుతుందో ? ఈ అబ్బాయిల ఆలోచనా ధోరణి ఎప్పుడు మారుతుందో ? అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

Telugu Acting, Casting Couch, Casting Couch In Tollywood, Commitments, Movies, Shocking Relation, Talent, Tollywood, Transgender Actress Harshini, Transgender Harshini-Movie

అలాగే ఇండస్ట్రీలో కూడా కొంతమంది కమిట్‌మెంట్ ఇస్తేనే క్యారెక్టర్ ఇస్తామనే వాళ్లు ఉంటారని ఆమె చెప్పుకొచ్చారు.కానీ తానేమీ అలాంటివి చేయలేదని ఆమె స్పష్టం చేశారు.మనం నిజాయతీగా ఉండి, మనలో టాలెంట్‌ను చూసి క్యారెక్టర్‌ ఇచ్చిన వాటిని చేసుకుంటూ పోతే చాలని హర్షిణి వివరించారు.

తాను కూడా ఒకటి, రెండు సార్లు అలాంటి అనుభవం ఎదురైందని, కానీ తాను నేరుగా నాకు ఇంట్రస్ట్ లేదని చెప్పినట్టు ఆమె చెప్పారు.కానీ మంచివాళ్లు కూడా ఇండస్ట్రీలో ఉన్నారన్న ఆమె, తన టాలెంట్ చూసి తనకు ఆ క్యారెక్టర్ సరిపోతుందని నమ్మి, మేడమ్ మీరు రేపు షూట్‌కి రమ్మన్న వాళ్లు కూడా ఉన్నారని ఆమె తెలిపారు.

ఇక్కడే కాదు ఏ రంగంలోనైనా మంచి వాళ్లుంటారు, చెడ్డ వాళ్లుంటారు అని ఆమె అన్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube