కేంద్ర సర్కార్ వినూత్న ఆలోచన, పారా మిలిటరీ రంగంలో వారికి అవకాశాలు!

టెక్నాలజీ తో పాటు మనుషుల ఆలోచన విధానాలు కూడా మారిపోతున్నాయి.ఒకప్పుడు ట్రాన్స్ జెండర్లు అంటే ఎలాంటి గౌరవం లేకుండా సమాజం నుంచి వెలివేసేందుకు ప్రయత్నించే వారు కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా భిన్నంగా తయారవుతున్నాయి.

 Trangenders May Soon Be Recruited As Capf Combat Officers, Trangenders, Capf Com-TeluguStop.com

వారికి పారా మిలిటరీ బలగాల్లో కూడా అవకాశాలు కల్పించాలి అని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.ట్రాన్స్‌జెండర్లను పారా మిలటరీ బలగాల్లో అసిస్టెంట్‌ కమాండెంట్లుగా నియమించే అంశాన్ని సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం.

వారి ఎంపికకు సంబంధించి వైఖరి ఏంటో తెలపాలని సీఏపీఎఫ్ బలగాలను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కోరింది.ఐటీబీపీ, బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్, ఎస్‌ఎస్‌బీ‌ విభాగాల్లో ట్రాన్స్‌జెండర్లను నియమించడంపై కేంద్రం చాన్నాళ్ల నుంచి ఫోక‌స్ పెట్టింది.

వారి నియామకాల విధివిధానాలు, ప్ర‌ణాళిక‌లు ఎలా ఉండాలో తెల‌పాల‌ని సీఏపీఎఫ్‌లను తాజాగా కోరినట్లు తెలుస్తుంది.

అయితే వాస్తవానికి ‘1986-87లో మహిళలు ర‌క్ష‌ణ ద‌ళాల్లో చేరినప్పుడు ఇలాంటి సమస్యలే ఎదురయ్యాయి.

ఒక వ్యక్తి శారీరకంగా ఫిట్ గా ఉంటే లింగభేదం అసలు సమస్యే కాదు ని కొందరు అభిప్రాయపడుతున్నారు కూడా.కాలంతో పాటే మ‌న‌మూ ముందుకెళ్లాలి అని కశ్మీర్‌ లోయలోని సీఆర్పీపీఎఫ్ ఆఫీస‌ర్ వ్యాఖ్యానించారు.

అయితే ట్రాన్స్ జెండర్స్ ను పారా మిలిటరీ రంగాల్లో తీసుకుంటే మాత్రం వారంతా అత్యంత ఎత్తైన బార్డ‌ర్ ఏరియాల్లో గ‌స్తీ కాయాలి, పశ్చిమ సరిహద్దుల్లోని పాకిస్థాన్ ఆర్మీపై పోరాటాలకు స‌న్నద్దంగా ఉండాలి.కాశ్మీర్‌లో టెర్ర‌రిజానికి వ్య‌తిరేకంగా పోరాడాలి అని ఈశాన్య భారతంలోని మరో అధికారి అభిప్రాయ‌ప‌డ్డారు.

Telugu Capfcombat, Central, Crpf, Pakisthan, Trangenders-

ట్రాన్స్‌జెండర్లపై అపోహలు తొలగేందుకు ఇది మంచి అవ‌కాశ‌మ‌ని ఓ రిటైర్డ్ ఆర్మీ అధికారి కూడా తెలిపారు.నిజంగా ఈ విషయం లో కేంద్రం సీరియస్ గా ట్రాన్స్ జెండర్స్ ను పారా మిలిటరీ రంగంలోకి తీసుకుంటే మాత్రం వారికి చాలా సంతోషం కలిగించే అంశంగా మారుతుంది.సమాజంలో వారి కి ఇస్తున్న విలువకు మరింత బలం చేకూరినట్లు అవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube