పొలంలో కుప్పకూలిన విమానం.. ఆ తర్వాత ఏం జరిగిదంట‌ే?

తరచుగా ప్రమాదాలు జరుగుతుంటాయి.అందులో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగగా ఎన్నో ప్రాణ నష్టాలు జరుగుతుంటాయి.

 Training Plane That Crashed On The Farm At Gandhinagar Ps Limitsbhopal, Training-TeluguStop.com

ప్రతిరోజు ఏదో ఒక చోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.ఇదిలా ఉంటే రోడ్డు పైనే కాకుండా గాలిలో కూడా రవాణా ప్రమాదాలు ఎన్నో జరుగుతుంటాయి.

విమానం గాలిలో ఎగురుతున్న సమయంలో అనుకోకుండా ఎన్నో ప్రమాదాలు జరిగాయి.ఇదిలా ఉంటే తాజాగా ఓ విమానం కుప్పకూలిన సంఘటన చోటు చేసుకుంది.

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ శివారులో ఓ పొలంలో విమాన ప్రమాదం జరిగింది.ఈ విషయం గురించి గాంధీ నగర్ పోలీస్ అధికారి అరుణ్ శర్మ తెలుపగా.ముగ్గురు పైలెట్ లతో కూడిన ఈ విమానం శిక్షణ విమానం కాగా శనివారం మధ్యాహ్నం రాజాభోజ్ విమానాశ్రయం నుంచి బయలుదేరిందని, భోపాల్ నుంచి గుణకు వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగిందని తెలిపారు.ఇక బయలుదేరిన కొద్ది సేపటికే భోపాల్ శివారులోని బిషన్ కేడీ ప్రాంతంలో విమానం పడిపోగా ప్రమాదం జరిగింది.

ఈ ప్రమాదంలో ముగ్గురు పైలెట్లు తీవ్రమైన గాయాలతో బయట పడ్డారు.ఈ ప్రమాదం జరిగిన వెంటనే అక్కడున్న స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళన చెందారు.ఇక ఆ పైలట్లను వెంటనే పోలీసుల సహాయంతో ఆసుపత్రికి తరలించారు.ప్రస్తుతం ఆ పైలెట్ బాధితులుఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఇక ఈ విమానం కుప్ప కూలిపోవడానికి కారణాలు తెలియకపోగా.ఆ విమానం నుండి వస్తున్న మంటలను అగ్నిమాపక సిబ్బంది ఆ మంటలను ఆర్పి వేశారు.

ఇక ప్రమాదం జరిగిన విమానం ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది.ఇదిలాఉంటే ఇది వరకు ఎన్నో గ్రామాలలో, ఎన్నో పంటపొలాల్లో విమాన ప్రమాదాలు చాలా జరిగాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube