ఇక పై రైలు ప్రయాణం చేయాల్సి వస్తే ఈ 9 పాయింట్లు తప్పనిసరి...!

ఇకపై ఎవరైనా ట్రైన్ బుక్ చేసుకొని ప్రయాణం చేయాలనుకునేవారికి భారతీయ రైల్వే కొన్ని ముఖ్యమైన నిబంధనలను ప్రయాణికులకు సూచించింది.ఇందుకు సంబంధించి అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా 9 అంశాలతో కూడిన ఒక పోస్ట్ ను జత చేసింది.

 Train Tickets, Carona Virus, Sanitizer-TeluguStop.com

ఎవరైతే ట్రైన్ లో ప్రయాణం చేయాలనుకున్న ప్రయాణికులు కచ్చితంగా ఆ 9 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలని తెలియజేసింది.లేకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చే పరిస్థితి ఉంది.

అయితే ఇప్పటికే భారతీయ రైల్వే శాఖ గతంలోనే కొన్నిఅంశాలను ప్రయాణికులకు వివరించింది.కాకపోతే కొందరు ఆ ప్రోటోకాల్ పాటించకుండా ఇష్టమొచ్చినట్లు ప్రయాణం చేయడంతో చాలామందికి కరోనా సోకిన సంఘటనలను మనం చాలా వరకు చూశాం.

మరి ఆ పాయింట్స్ ఒకసారి చూద్దామా….ఇందులో మొదటగా కేవలం ఈ టికెట్ కన్ఫామ్ అయిన ప్రయాణికులకు మాత్రమే రైల్వే స్టేషన్ లోకి రైలు ఎక్కడానికి అనుమతిని ఇవ్వబోతున్నారు.

ఇందుకోసం ప్రత్యేకంగా కన్ఫామ్ పాస్ చూపించాల్సిన అవసరం లేదు.అయితే సదరు ప్రయాణికులు 90 నిమిషాలకు ముందే రైల్వే స్టేషన్ కు చేరుకోవాలని రైల్వే శాఖ తెలిపింది.

దీనికి ముఖ్య కారణం థర్మల్ స్క్రీనింగ్ చేయించుకోవాలి కాబట్టి.

ఇలా థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాత ఎలాంటి కరోనా వైరస్ లక్షణాలు లేని ప్రయాణికులు మాత్రమే రైలు ఎక్కేందుకు అధికారులు అనుమతిస్తారు.

ఆతర్వాత ప్రయాణానికి సంబంధించి ఎవరైతే ప్రయాణం చేయాలనుకున్నారో వారి స్మార్ట్ ఫోన్ లో కచ్చితంగా ఆరోగ్య సేతు యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి.అయితే అధికారులు ఎటువంటి బ్లాంకెట్స్ అందించారు.

కాబట్టి కేవలం ప్రయాణికులు వాటిని ఖచ్చితంగా తెచ్చుకోవాలి.అంతేకాదు రైల్వేస్టేషన్లో ఎటువంటి ఆహారం మంచినీళ్లు కూడా దొరకవు కాబట్టి వాటిని కూడా వెంట తెచ్చుకోవాల్సి ఉంటుంది.

ఆ తర్వాత రైలు ఎక్కేటప్పుడు ఖచ్చితంగా సోషల్ డిస్టెన్స్ పాటించాలి.ఇక మీరు వెళ్లాల్సిన రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలలో కచ్చితంగా ఆ రాష్ట్రాలకు సంబంధించి హెల్త్ ప్రోటోకాల్స్ ను ప్రయాణికులు అంగీకరించాల్సిన అవసరం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube