అమ్మ చేతిలో నుంచి జారి ట్రాక్‌పై పడిన చిన్నారి.. ఇంతలో కదిలిన రైలు! చివరకు ఏమైందో తెలుస్తే ఆశ్చర్యపోతారు!

పిల్లలను బయటకి తీసుకెళ్లినప్పుడు తల్లితండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి.ముఖ్యంగా రైల్వే స్టేషన్స్ లో.

 Train Passes Over 1 Year Old In Up Baby Survives Without A Scratch1-TeluguStop.com

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథుర రైల్వేస్టేషన్ వద్ద చోటుచేసుకున్న ఈ సంగతి తెలుస్తే మీ పిల్లల్ని అస్సలు అజాగ్రత్తగా వదలరు.ఏడాది పసికందు రైలు పట్టాలపై పడింది.

అదృష్టం బాగుంది ప్రాణాలతో బయటపడింది.వివరాలలోకి వెళ్తే.

ఆశ్చర్యకరమైన ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథుర రైల్వేస్టేషన్‌లో మంగళవారం చోటుచేసుకుంది.ఇందతా అక్కడ సీసీటీవీల్లో రికార్డు కావడంతో ప్రస్తుతం వైరల్‌గా మారింది.ఢిల్లీ- విశాఖ సమతా ఎక్స్‌ప్రెస్ రైల్లో మథురకు చెందిన సోను దంపతులు తమ పాప సాహిబాతో కలిసి ఆగ్రాకు చేరుకున్నారు.ఒకటో నెంబరు ప్లాట్‌ఫాంపై రైలు ఆగడంతో అందులో నుంచి దిగేందుకు ప్రయత్నించారు.

ఓవైపు ప్రయాణీకులు రద్దీ ఎక్కువగా ఉండటం, ఇంతలో రైలు కదలడంతో ఎవరో పాప తల్లిని వెనుక నుంచి నెట్టేశారు.దీంతో చేతిలో ఉన్న చిన్నారి జారిపడి ట్రాక్‌పై పడిపోయింది.

ఇంతలో రైలు కదలడంతో బోగీలు ఆమె మీదుగా వెళ్లిపోయాయి.

దీంతో ప్లాట్‌ఫామ్‌పై ఉన్న ప్రయాణికులంతా గాబరా పడ్డారు.రైలు వెళ్లిపోగానే ఒక వ్యక్తి ట్రాక్‌పైకి దూకి ఆ పసికందును తీసి తల్లిదండ్రులకు అందజేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.మృత్యువును జయించిన ఆ చిన్నారిని ఆశీర్వదించడానికి తోటి ప్రయాణికులు పోటీపడ్డారు.

పట్టాలు, ప్లాట్‌ఫాంకు మధ్య పడటం, రైలు చక్రాలకు, చిన్నారికి మధ్య ఒక్క అంగుళం మాత్రమే దూరం ఉండటం గమనార్హం.

దీనిపై పాప తండ్రి సోనూ మాట్లాడుతూ… తాము దిగేందుకు ప్రయత్నిస్తుండగా రైలు కదిలిపోయిందని అన్నారు.

దీంతో తాను లగేజి తీసుకోగా, పాపను నా భార్య ఎత్తుకుని దిగుతుండగా వెనుక నుంచి ఎవరో నెట్టేయడంతో చేతుల్లో నుంచి సాహిబా జారిపోయి, పట్టాల మధ్య పడిపోయినట్టు తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube