జపాన్, జర్మనీ.ఈ దేశాల పేర్లు వినగానే అందరికీ మొదటగా గుర్తుకు వచ్చేది అప్పట్లో జరిగిన అణు బాంబు దాడులు.కానీ ఇది ఒకప్పటి మాట.కాగా ప్రస్తుతం ఈ రెండు దేశాలు సాంకేతిక విజ్ఞాన పరంగా మరియు అభివృద్ధి పరంగా దూసుకుపోతున్నాయి.అంతే కాకుండా ఈ దేశాలలో తయారు చేసేటటువంటి పరికరాలు దాదాపుగా ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతి చేయబడుతున్నాయి.దీంతో ఈ దేశాల వార్షిక ఆదాయం కూడా దాదాపుగా ఎక్కువగానే ఉంది.
ఇప్పుడు జర్మనీ దేశం గురించి మరిన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.
జర్మనీ దేశం యొక్క రాజధాని బెర్లిన్.
అలాగే ఈ దేశం కరెన్సీ యూరోలలో కొలుస్తారు.అయితే 2019వ సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం ఈ దేశంలో దాదాపుగా 9 కోట్ల మందికి పైగా ప్రజలు నివాసముంటున్నారు.
అయితే ఈ దేశంలో ఎక్కువగా అటవీ ప్రాంతాలు ఉండేవి.దీంతో అటవీ ప్రాంతాల గూండా రైళ్లు ప్రయాణించే సమయంలో జింకలు రైలు ప్రమాదానికి గురయ్యేవి.
దీంతో ప్రతి ఏటా ఈ రైలు ప్రమాదాల కారణంగా వేల సంఖ్యలో జింకలు మృతి చెందేవి.దీంతో కొంత కాలం పాటు ఈ సమస్యను ఎలా అరికట్టాలనే విషయంపై నిపుణులు సతమతమయ్యే వాళ్ళు.
కానీ చివరికి సింహం పేడని రైలు పట్టాలపై పరచడం వల్ల ఈ సమస్యను కొంతమేర అరికట్ట గలిగారు.ఎందుకంటే జింకలకి సింహాలు అంటే భయం కాబట్టి.
దాంతో సింహం పేడ వాసన చూడడంతో జింకలు అక్కడి నుంచి పారిపోయేవి.కానీ వర్షం వచ్చిన సమయంలో సింహం పేడ పట్టాల నుంచి కొట్టుకుపోవడంతో ఇది కూడా పెద్దగా వర్కవుట్ కాలేదు.

కానీ ఆ తర్వాత కొంతమంది నిపుణులు జింకల కుక్కలంటే భయం కాబట్టి రైళ్లలో వినిపించే హారన్ కి కుక్క అరిచే శబ్దాలను జోడించారు.దీంతో జింకలు అడ్డం వచ్చినప్పుడు రైలు పైలెట్లు కుక్క అరుపులు వినిపించే వాళ్ళు.దాంతో జింకలు అక్కడి నుంచి పారిపోయేవి.ఇలా చేయడం వల్ల దాదాపుగా సమస్యను అరికట్ట గలిగారు.అయితే ఈ విషయం ఇలాఉండగా టెక్నాలజీ పరంగా జర్మనీ దేశం బాగానే అభివృద్ధి చెందడంతో పాటు పర్యాటక రంగం పరంగా కూడా బాగానే అభివృద్ధి చెందింది.దీంతో తరచూ ఇతర దేశాల నుంచి మన దేశానికి ఎంతో మంది పర్యాటకులు వస్తుంటారు.