విడ్డూరం : ఆత్మహత్య చేసుకోబోతున్నట్లుగా సెల్ఫీ వీడియో.. తెలివిగా ప్రాణాలు కాపాడిన స్నేహితుడు

చిన్న చిన్న కారణాలతో ఆత్మహత్యలు చేసుకున్న వారు ఎంతో మంది ఉన్నారు.ఆత్మహత్యలకు కారణాలు చూస్తే కొన్ని సార్లు నవ్వు వస్తుంది, కొన్ని సార్లు కోపం వస్తుంది.

 Train Driver Helped And Saved The Mans Life-TeluguStop.com

ఇంత చిన్న విషయానికి కూడా ఆత్మహత్యలు చేసుకుంటారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తుంటాం.ఆత్మహత్య చేసుకునేందుకు వెళ్లే వారు కొందరు ఈమద్య టెక్నాలజీని ఉపయోగించి తమ బాధలను చెప్పుకుంటున్నారు.

తాజాగా ఒక వ్యక్తి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా సెల్ఫీ వీడియోను స్నేహితుడికి పంపించాడు.

సెల్ఫీ వీడియోలో తన భార్య వల్ల చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాను.

నా వల్ల కావడం లేదంటూ ఆత్మహత్యకు సిద్దం అయ్యానని చెప్పాడు.సెల్ఫీ వీడియో రిసీవ్‌ చేసుకున్న వ్యక్తి అవాక్కయ్యాడు.

ఫోన్‌ చేసినా ఆన్సర్‌ చేయడం లేదు.వెంటనే అతడు ఎక్కడ ఆత్మహత్య చేసుకోబోతున్నాడనే విషయాన్ని తెలుసుకునేందుకు వీడియోను ఒకటికి రెండు సార్లు చూశాడు.

వీడియోలో అతడు ఉన్న ప్రాంతంలో రైల్వే ట్రాక్‌ ఉందని, అక్కడ ఒక పచ్చని రైల్వే సిగ్నలింగ్‌ రాయి ఉందని గుర్తించాడు.

విడ్డూరం : ఆత్మహత్య చేసుకోబోత�

వెంటనే తన స్నేహితుడికి విషయాన్ని చెప్పి సాయం చేయమన్నాడు.ఆ స్నేహితుడు ఆ సమయంలో రైలులోనే ఉన్నాడు.దాంతో వెంటనే డ్రైవర్‌ వద్దకు వెళ్లి ఆ వీడియోలో ఉన్న రాయిని చూపించి ఇది ఎక్కడ ఉందని గుర్తించాల్సిందిగా కోరాడు.

తనకున్న పరిజ్ఞానంతో ఆ రాయి ఉన్న ప్రదేశం చెప్పాడు.వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించడంతో పాటు, అటుగా వెళ్లే రైలు అన్నింటిని కూడా స్లోగా వెళ్లాల్సిందిగా మెసేజ్‌ పాస్‌ చేయడం జరిగింది.

ఇదంతా కూడా కేవలం అరగంట వ్యవధిలోనే పూర్తి అయ్యింది.దాంతో అతడి ప్రాణాలు కాపాడగలిగారు.

మరో పావుగంట సమయం ఆలస్యం అయ్యి ఉంటే ఖచ్చితంగా అతడి ప్రాణాలు గాల్లో కలిసి పోయేవి.పోలీసులు అదుపులోకి తీసుకుని అతడికి కౌన్సిలింగ్‌ ఇచ్చారు.

పోలీసులు అతడి భార్యను కూడా పిలిపించి కౌన్సిలింగ్‌ ఇచ్చి పంపించారు.ఈ సంఘటన కేరళ రాష్ట్రంలోని కొట్టాయం జిల్లాలో జరిగింది.

సెల్ఫీల వల్ల ప్రాణాలు పోవడం చూశాం.కాని మొదటి సారి సెల్ఫీ వీడియో కారణంగా ప్రాణం నిలిచింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube