మీరు ల్యాండ్ ఫోన్ వాడుతున్నారా.. ఇకపై ఇది గుర్తు పెట్టుకోవాల్సిందే ..!  

ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్ ఫోన్ ఉంది.దీంతో చివరికి ల్యాండ్ ఫోన్ ను మరిచే పరిస్థితి ఏర్పడింది.

TeluguStop.com - Trai Telecom Operators Land Phone Zero Prefix Mobile Numbers

అయితే ఇప్పటికి కొన్ని ప్రదేశాలలో లాండ్ ఫోన్స్ నుంచి సంభాషణ జరుగుతున్న వారు కూడా లేకపోలేదు.అయితే ఇలాంటి వారికి తాజాగా ఓ విషయం తెలిపింది ట్రాయ్.2021 జనవరి 1వ తేదీ నుండి మొబైల్ కు కాల్ చేసేటప్పుడు కొత్తగా మరో అంకె జత చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.ల్యాండ్ లైన్ ఫోన్ నుండి మొబైల్ ఫోన్ కు ఫోన్ చేయాలంటే ప్రస్తుతం ఉన్న పది నంబర్లతో పాటు మరో సంఖ్యను జత చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇందుకు సంబంధించి ప్రస్తుతం మొబైల్ నెంబర్ కు ఉన్న పది నెంబర్లతో ముందు సున్నా (0) ను జతచేసి ఫోన్ చేయాల్సి ఉంటుంది.

TeluguStop.com - మీరు ల్యాండ్ ఫోన్ వాడుతున్నారా.. ఇకపై ఇది గుర్తు పెట్టుకోవాల్సిందే ..-General-Telugu-Telugu Tollywood Photo Image

ఈ పరిస్థితికి అనుగుణంగా తాజాగా ట్రాయ్ టెలికం కంపెనీలకు ఓ సమాచారాన్ని అందించింది.

అయితే ఇందుకోసం అవసరమైన వ్యవస్థను ప్రవేశ పెట్టాలని టెలికం కంపెనీలకు ఉత్తర్వులు జారీ చేసింది ట్రాయ్.ఇందులో భాగంగా కొత్త నెంబర్ లు జారీ చేసేందుకు వీలు కావడంతో టెలికాం సంస్థలు ఈ నిర్ణయాన్ని స్వాగతించాయి.

ఈ రూల్ ప్రకారం ల్యాండ్ ఫోన్ నుండి మొబైల్ నంబర్లకు దయచేసి ముందు సున్నాను జోడించడం తర్వాత వాటికి అవసరమైన సాంకేతిక వ్యవస్థ త్వరలోనే అందుబాటులోకి తీసుకురావాలని ట్రాయ్ ఉత్తర్వులు జారీ చేసింది.ఈ కొత్త ప్రక్రియ జనవరి 1 లోపు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది.ఈ ప్రక్రియ విధానం ద్వారా భవిష్యత్తు అవసరాల కోసం ఏకంగా 2500 మిలియన్లకు పైగా కొత్త నెంబర్లను అదనంగా టెలికామ్ ఆపరేటర్లకు లభించబోతున్నాయి.ఈ నిర్ణయం తో ల్యాండ్ ఫోన్ లో నుంచి సెల్లర్ మొబైల్ కు ఫోన్ చేయాల్సి వస్తే బ్యాక్ గ్రౌండ్ సాఫ్ట్ వేర్ లో కొన్ని మార్పులు చేయాల్సి ఉంది టెలికాం సంస్థలు.

#Using #TRAINew #ZeroPrefix #2500 Millions #LandPhone

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు