నెల్లూరులో విషాదం.. కలచివేస్తోన్న కవలల మరణం..!

కవల పిల్లలు.ఒక్క కానుపులో ఇద్దరు పుడితే ఎంత ఆనందంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

 Tragedy Twins Died In Nellore District-TeluguStop.com

ఇంకా అలానే ఇంటికి ఒక్కరు వస్తారు అనుకుంటే ఇద్దరు కలిసి వచ్చి ఆ తల్లితండ్రులకు డబుల్ ధమాకా ఇచ్చారు.కలిసి పెరుగుతూ ఎంతో ప్రేమగా ఉండేవారు.

ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంత ప్రేమ వారి సొంతం అయ్యింది.

 Tragedy Twins Died In Nellore District-నెల్లూరులో విషాదం.. కలచివేస్తోన్న కవలల మరణం..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఎంతో ప్రేమగా ఉండే అన్నదమ్మల జీవితాలని మద్యం అర్ధాంతరంగా అంతమొందించింది.

తల్లి కడుపులో నుండి ఎలా అయితే ఒకసారి బయటకు వచ్చారో.అలానే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు ఆ కవలలు.

ఇంకా ఈ విషాద ఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది.అనుమసముద్రంపేటకి చెందిన వేమన చందు, రమేష్ కవల సోదరులు.


అయితే మద్యం అలవాటు ఉన్న రమేష్ గ్రామంలో మందు దొరక్క శానిటైజర్ తాగి ప్రాణాలు కోల్పోయాడు.తమ్ముడి మరణం చందుని తీవ్రంగా కుంగదీసింది.

దీంతో ఒంటరినై పోయానన్న బాధతో చందు కుమిలిపోయాడు.రమేష్ అంత్యక్రియలు నిర్వహిస్తుండగా చందు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.

దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు చందుని ఆస్పత్రికి తరలించారు.చందుని పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు తేల్చారు.

చేతికందిన కొడుకుల హఠాన్మరణంతో ఆ తల్లితండ్రులకు తీరాని శోకాన్ని మిగిల్చింది.

#Twins #Twin Brothers #VemanaChandhu #Nellore #Sanitizers

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు