పశ్చిమగోదావరి జిల్లాలోని సిద్ధాంతం బ్రిడ్జిపై నుంచి గోదావరిలో దూకిన నవవధువు మృతదేహం లభ్యమైంది.అయితే నిన్న నవ వధూవరులు గోదావరిలో దూకిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో వెంటనే గమనించిన మత్స్యకారులు భర్తను సురక్షితంగా బయటకు తీసుకురాగా .వధువు జాడ తెలియలేదు.ఈ క్రమంలోనే నిన్నటి నుంచి పోలీసులు గాలింపు చేపట్టగా ఇవాళ ఉదయం ఆమె మృతదేహాం లభ్యమైంది.అలాగే ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నవ వధువు మృతదేహాంపై గాట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారని తెలుస్తోంది.మరోవైపు నవ వధువు సత్యవాణి మృతిపై ఆమె బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
తమ కూతురు మృతికి అల్లుడు శివరామకృష్ణ కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.కాగా పెనుగొండ మండలం వడలి గ్రామానికి చెందిన సత్యవాణికి అత్తిలి మండలానికి చెందిన శివరామకృష్ణకు ఈనెల 15న వివాహం జరిగింది.