మలయాళ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. నేషనల్ అవార్డ్ గ్రహీత మరణం.. !

కరోనా కారణంగా యువకులే తట్టుకోలేకపోతున్న క్రమంలో ఇక వయస్సు మళ్లిన వారికైతే చెప్పవలసిన అవసరం లేదు.కాగా కరోనా సెకండ్ వేవ్ మాత్రం పగబట్టినట్లే ప్రముఖులందరిని టార్గెట్ చేసినట్లుగా ఉంది.

 Tragedy In Malayalam Film Industry Malayalam, Film Industry, Actor, Writer, Mada-TeluguStop.com

ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అన్ని రంగాల వారినే కాకుండా సినిరంగానికి చెందిన ప్రముఖులను కూడా తన పొట్టన పెట్టుకుంటుంది.ఇప్పటికే చిత్ర సీమలోని స్టార్ హీరోలతో పాటుగా అన్ని శాఖల్లోని వారికి సోకుతున్న కరోనా పట్ల కాస్త జాగ్రత్తగ మసలుకోవలసిన అవసరం ఉంది.

ఇదిలా ఉండగా తాజాగా మలయాళ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది.క‌రోనా కార‌ణంగా మలయాళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు, రచయిత మదంపు కుంజుకుట్టన్(81) మరణించారు.

ఇకపోతే అశ్వద్ధామ అనే సినిమాతో 1978 లో సినీ రంగ ప్రవేశం చేసిన కుంజుకుట్టన్ 2000లో విడుదలైన ‘కరుణమ్’ అనే సినిమాకు ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయితగా నేషనల్ అవార్డు అందుకున్నారు.ఇక ఈయన మృతికి పలువురు మలయాళ చిత్రరంగ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలుపుతు, వీరి కుంటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి అందిస్తున్నారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube