ఎప్పుడు పుడతామో తెలియదు, ఎప్పుడు మరణిస్తామో తెలియదు అందుకే చావు, పుట్టుకకు ఎవరూ అతీతులు కాదు.కానీ అసలు జీవితాన్ని సగభాగం కూడా గడపని ఎంతో మంది మృతి చెందిన ఘటనలు వింటే మనసు చెలించక మానదు.
ఎంతో మంది యువకులు, చిన్న పిల్లలు అనుకోకుండా ఊహించని విధంగా మృతి చెందిన ఘటనలు వింటే ఎంతో ఆవేదనకు లోనవుతాం.ఆఫ్ఘాన్ లో తాలిబన్ల నుంచీ తప్పించుకునే క్రమంలో ఓ యువ క్రీడాకారుడు మృతి చెందిన ఘటన యావత్ ప్రపంచాన్ని కదిలించింది.
తాజాగా ఆఫ్రికాలో ఇద్దరు యువ భారతీయ జంట మృతి చెందిన ఘటన భారతీయులు ప్రతీ ఒక్కరిని కదిలిస్తోంది.
వివరాలలోకి వెళ్తే ఎనో ఆశలతో పెళ్లి చేసుకున్న భారతీయ యువ దంపతులు దీపక్ మీనన్, గాయత్రి లు ఊహించని విధంగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన భారతీయ సమాజంలో తీవ్ర ఆవేదన కలిగిస్తోంది.
దీపక్ మీనన్ వయసు 29 కాగా గాయత్రి వయసు 25 ఏళ్ళు.వీరి ఇరువురికి సరిగ్గా ఏడాది క్రితమే పెళ్లి అయ్యింది.ఆఫ్రికాలో ఉంటున్న ఈ ఇద్దరు యువ దంపతులు త్రిసూర్ కు చెందిన వాళ్ళు.అయితే ఆఫ్రికాలో స్నేహితుల ఇంటికి వెళ్లి మళ్ళీ తిరుగు ప్రయాణం చేస్తున్న వీరిద్దరూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్టుగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
స్నేహితులను కలిసి వస్తున్న సమయంలో ఆఫ్రికాలోని బోట్స్వానా సమీపంలో హైవే ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఈ ఇద్దరు దంపతులు తమ కారును ఆపారు.ఈ క్రమంలోనే ఒక్క సారిగా ఊహించని విధంగా వెనుకనుంచీ అత్యంత వేగంతో వచ్చిన మరో కారు డీ కొట్టింది.
ఈ ఘటనతో ఒక్క సారిగా అక్కడికక్కడే దంపతులు ఇద్దరూ మృతి చెందారు.గత ఏడాది డిసెంబర్ లో పెళ్లి చేసుకుని ఒక్కటయిన ఈ దంపతులు మృతి చెందటం స్నేహితులలో, కుటుంభ సభ్యులలో తీరని విషాదాన్ని నింపింది.