భారత టీం ఆల్ రౌండర్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా ఇంట్లో విషాదం..!!  

hardhik pandya,england,virat kohli,Himanshu Pandya - Telugu England, Hardhik Pandya, Himanshu Pandya, Virat Kohli

ఇండియా టీమ్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఇంటిలో విషాద ఘటన చోటు చేసుకుంది.హార్దిక్ పాండ్యా తండ్రి హిమాన్షు పాండ్యా తుది శ్వాస విడిచారు.

ఈరోజు ఉదయం ఇంటిలోనే గుండెపోటు రావడంతో ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యులు చెప్పుకొచ్చారు.ప్రస్తుతం హార్దిక్ పాండ్యా ఎటువంటి టోర్నమెంట్ లు ఆడటం లేదు.

త్వరలో ఇంగ్లాండ్ టీం తో జరగబోయే మ్యాచ్ ల కోసం ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు.  హార్దిక్ పాండ్యా సోదరుడు కృణాల్ పాండ్యా కూడా క్రికెటర్ పైగా ప్రస్తుతం స‌య్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో బ‌రోడా కెప్టెన్‌గా బాధ్యత‌లు నిర్వహిస్తున్న క్రమంలో తండ్రి మరణవార్త తెలుసుకుని వెంటనే టోర్నీ నుండి తప్పుకొని ఇంటికి చేరుకున్నాడు.

ఇదిలా ఉంటే బరోడా క్రికెట్ అసోసియేషన్ హార్దిక్ పాండ్యా తండ్రి హిమాన్షు పాండ్యా మరణించడం పట్ల సంతాపం వ్యక్తం చేశారు.అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ తన ఇద్దరు కుమారులు క్రికెట్ రంగంలో రాణించడానికి ఆయన ఎంతగానో కృషి చేసినట్లు చెప్పుకొచ్చారు.క్రికెట్ ఆట అంటే ఆయనకు ఎంతో ఇష్టం అని చెప్పుకొచ్చారు.మరోపక్క ఒకానొక సమయంలో హిమాన్షు పాండ్యా కూడా ఇంటర్వ్యూలో ఇదే విషయాలు తెలియజేశారు.తన ఇద్దరు కుమారులను క్రికెట్ ఆడిస్తుంటే.దగ్గరుండి చెడగొడుతున్నారు అని, తనని బంధువులు విమర్శించారని వాటన్నిటినీ పట్టించుకోకుండా.

కొడుకులిద్దరూ క్రికెట్ రంగంలో రాణించాలని కోరుకుని వాళ్లను ఓ స్థాయిలోకి తీసుకువచ్చినట్లు ఆయన చెప్పుకొచ్చారు.

నా కొడుకులు క్రికెట్ రంగంలో రాణించటం నిజంగా దేవుడిచ్చిన వరం అంటూ అప్పట్లో హార్ధిక్ తండ్రి హిమాన్షు పాండ్యా తెలపడం జరిగింది.అటువంటి వ్యక్తి చనిపోవడంతో బరోడా క్రికెట్‌ అసోసియేషన్ సభ్యులతోపాటు బీసీసీఐ అధికారులు కూడా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.ఇదిలా ఉంటే హార్దిక్ పాండ్యా తండ్రి మరణంపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించారు.

ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశాడు.ఆయనతో రెండుమూడుసార్లు మాట్లాడటం జరిగిందని, ఆయన ఎప్పుడు జీవితంలో సంతోషంగా ఉండేవారని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

అంతేకాకుండా జీవితంలో అన్ని సాధించాను అనే భావన ఆయనలో ఉండేదని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోహ్లీ పేర్కొన్నాడు. 

.

#Virat Kohli #England #Hardhik Pandya #Himanshu Pandya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు