ఇదేందయ్యా ఇది : కారులో హెల్మెట్ పెట్టుకోలేదని...   

Traffic Police Fine 135 Rs For With Out Helmet Car Driving - Telugu Trafiic Police Fine 135 Rs For With Helmet Car Driving, Trafiic Police Latest News, Trafiic Police News, With Out Helmet Car Driving, With Out Helmet Car Driving News

ఇటీవల కాలంలో రోడ్లపై ప్రయాణించే ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా వాడాలని ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే.ఒకవేళ ద్విచక్ర వాహనంలో ప్రయాణించే ప్రయాణికులు హెల్మెట్ ధరించకపోతే ట్రాఫిక్ పోలీసులు ప్రభుత్వ ట్రాఫిక్ నిబంధనలకు అనుగుణంగా చలాన విధించడం చూస్తుంటాం.

 Traffic Police Fine 135 Rs For With Out Helmet Car Driving

కానీ తాజాగా కారులో వెళ్తున్న టువంటి వ్యక్తి హెల్మెట్ పెట్టుకోలేదని పోలీసులు 135 రూపాయలు జరిమానా విధించిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్టణంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే స్థానిక పట్టణానికి చెందిన ఓ వ్యక్తి తన కారులో వ్యక్తిగత పని నిమిత్తమై బయటికి వచ్చాడు.

ఇదేందయ్యా ఇది : కారులో హెల్మెట్ పెట్టుకోలేదని… -General-Telugu-Telugu Tollywood Photo Image

దీంతో రోడ్డు మీద వెళ్తున్న సమయంలో అనుకోకుండా తన చరవానికి ఓ సందేశం వచ్చింది.అయితే ఇంతకీ ఆ సందేశం ఏంటా అని చూడగా ఒక్కసారిగా ఆ వ్యక్తి ఖంగు తిన్నాడు.

అయితే తాను ఖంగు తిన్నది తనకు ఫైన్ విదించినందుకు కాదని తనకు ఫైన్ విధించడానికి గల కారణాలు చూసి ఒక్కసారిగా షాక్ అయ్యానని చెప్పుకొచ్చాడు.అయితే ఇంతకీ తనకి ఫైన్ విధించడానికి గల కారణం ఏంటంటే అతడు కారులో ప్రయాణిస్తున్న సమయంలో హెల్మెట్ ధరించకపోవడం తో 135 రూపాయలు ఫైన్ విధించినట్లు ట్రాఫిక్ పోలీస్ అధికారులు మెసేజ్ పంపించారు.

అయితే ఈ విషయం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.ఎందుకంటే కారులో ప్రయాణించేటప్పుడు మామూలుగా సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాల్సి ఉంటుంది.కానీ ఎక్కడా కూడా హెల్మెట్ ధరించాలి అనే నియమం ఉండదు.దీంతో ట్రాఫిక్ పోలీస్ అధికారులపై కొందరు ఈ ఫైన్ బాధితులు ట్రోల్స్ చేస్తున్నారు.అయితే అధికారులు మాత్రం సాంకేతిక లోపం వల్ల ఇలా జరిగి ఉంటుందని చెప్పుకొస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Traffic Police Fine 135 Rs For With Out Helmet Car Driving Related Telugu News,Photos/Pics,Images..

footer-test