చోద్యం : ఆ ప్రేమ జంట పెళ్లికి సాయం చేసిన ట్రాఫిక్‌ పోలీసుల ఈ - చలానా

మెట్రో సిటీల్లో ట్రాఫిక్‌ రూల్స్‌ను అతిక్రమిస్తే ఈ చలానా విధిస్తారు.పోలీసులు పట్టించుకోవడం లేదు, చూడటం లేదు అంటూ ఎక్కడైనా ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ను జంప్‌ చేసినట్లయితే వెంటనే సీసీ కెమెరాల్లో పట్టుకుంటారు.

 Traffic Police E Challan Helps Lovers-TeluguStop.com

సీసీ కెమెరాల్లో మానిటర్‌ చేసి పోలీసులు ఈ ఛలానాను పంపిస్తారు అనే విషయం తెల్సిందే.హైదరాబాద్‌తో పాటు ముఖ్య మెఓ నగరాల్లో ఈ విధానం అమలులో ఉంది.

ఫొటోలు తీశారు అంటే ఈ ఛలానా రావడం ఖాయం.ఇలాంటి ఈ ఛలానా తాజాగా ఒక ప్రేమ జంటను కలిపింది.
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఒక విచిత్రం జరిగింది.ట్రాఫిక్‌ పోలీసులు పంపించిన ఈ ఛలానా వల్ల ఒక ప్రేమ జంట పెళ్లి అయ్యింది.ఛలానా వల్ల ప్రేమ విషయం బయటకు రావడం, వారి ప్రేమ విషయం కుటుంబ సభ్యులకు తెలియడం, ఇద్దరి కుటుంబ సభ్యులు పెళ్లికి ఒప్పుకుని పెళ్లి కూడా చేయడం జరిగింది.ఈ సంఘటన గుజరాత్‌తో పాటు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది.

ఈ ఛలానా వల్ల ఈ జంటకు మంచి జరిగింది.అయితే కొన్ని జీవితాల్లో చెడు కూడా జరుగుతుంది.

బండిపై ఎవరితోనో ఉన్న సమయంలో ఛలాలా పడ్డట్లయితే ఆ ఫొటో ఛలానా లో వస్తుంది.అది కాస్త కుటుంబంను చిన్నా భిన్నం చేస్తుంది

ఈ ఛలానా ఎలా ప్రేమ జంటను కలిపిందో ఇప్పుడు చూద్దాం.

ఇటీవల గుజరాత్‌ రాష్ట్రం అహ్మదాబాద్‌లో షారేఖ్‌ అనే యువకుడు టూ వీలర్‌పై ప్రయాణిస్తూ సిగ్నల్స్‌ను బ్రేక్‌ చేశాడు.అతడికి ఛలానా వచ్చింది.

ఆ ఛలానా పేపర్‌లో అతడి బండిపై మరో వ్యక్తి ఉన్నట్లుగా ఫొటో ఉంది.ఆ వ్యక్తి ఒక అమ్మాయి.

షారేఖ్‌ తల్లిదండ్రులు అతడిని ప్రశ్నించారు.దాంతో అతడు ఆమె గురించి చెప్పాడు.

తామిద్దరం ప్రేమించుకుంటున్నట్లుగా చెప్పాడు.షారేఖ్‌ తల్లిదండ్రులు ఆమె కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లి మాట్లాడి ఇద్దరి నిఖ పక్కా చేశారు.

అలా ఈ ఛలానా వల్ల వారి పెళ్లి అయ్యింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube