డ్యాన్సింగ్ స్టెప్స్ తో ట్రాఫిక్ సూచనలు  

Traffic Cop Manages Traffic Through Dance Moves-heavy Traffic In Metro City\\'s,traffic Cop

ఇటీవల ట్రాఫిక్ పోలీసులు తమ విధులను నిర్వర్తించడం తో భిన్నత్వం చూపిస్తున్నారు.ఎదో వచ్చామా ట్రాఫిక్ ని కంట్రోల్ చేశామా అన్నట్లుగా కాకుండా జనాలను ఎంటర్ టైన్ చేయాలని చూస్తున్నారు.

Traffic Cop Manages Traffic Through Dance Moves-heavy Traffic In Metro City\\'s,traffic Cop Telugu Viral News Traffic Cop Manages Through Dance Moves-heavy In Metro City\\'s Traffic-Traffic Cop Manages Through Dance Moves-Heavy In Metro City\\'s

ఈ క్రమంలోనే ఆ మధ్య ఒక ట్రాఫిక్ పోలీస్ దలేల్ మెహందీ హిట్ సాంగ్ ట్యూన్ తో ట్రాఫిక్ నిబంధలను పాడి అందరిని ఆకట్టుకున్న విషయం తెలిసిందే.అప్పట్లో ఈ వీడియో సోషల్ మీడియా లో తెగ వైరల్ కూడా అయ్యింది.

అయితే ఇప్పుడు తాజాగా మరో ట్రాఫిక్ పోలీస్ డ్యాన్స్ మూమెంట్స్ తో ని కంట్రోల్ చేస్తూ మరోపక్క ప్రయాణికులను అలరిస్తున్నాడు.ఈ తాజా ఘటన ఛత్తీస్ గఢ్ లోని రాయ్ పూర్ లో చోటుచేసుకుంది.

అక్కడి ట్రాఫిక్ కానిస్టేబుల్ డ్యాన్స్ మూమెంట్స్ చేస్తూ ప్రయాణికులకు సూచనలు చేస్తున్నారు.వాస్తవానికి మధ్యప్రదేశ్ లోని ట్రాఫిక్ పోలీస్ రంజిత్ సింగ్ ఇలానే చేస్తూ ఉంటారు.

అయితే ఆయనను ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇలా స్టెప్స్ వేస్తూ ట్రాఫిక్ ని కంట్రోల్ చేస్తున్నట్లు మహమ్మద్ మొహసిన్ షేక్ తెలిపాడు.

మొత్తానికిట్రాఫిక్ పోలీసులు మాత్రం వినూత్నంగా ఇలా డ్యూటీ ని ఎంజాయ్ చేస్తూ ట్రాఫిక్ ని కంట్రోల్ చేస్తుండడం తో వాహనదారులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.నిజంగా ఈ ట్రాఫిక్ ని నియంత్రించే సమయంలో ఎంతో అసహనానికి గురిఅవుతూ ఉంటారు.అలాంటిది ఇలా పాటలు పడుతూ,డ్యాన్స్ లు చేస్తూ ఆ డ్యూటీ ని ఎంజాయ్ చేస్తుంటే ఎంతసేఫు అయినా డ్యూటీ చేస్తూనే ఉంటారేమో.

తాజా వార్తలు