టీపీసీసీ రేవంత్ రెడ్డి కామెంట్స్.టీఆరెస్, బీజేపీ వి కుమ్మక్కు రాజకీయాలు.
ఈ కుమ్మక్కు రాజకీయాలను తెలంగాణ సమాజం గమనిస్తోంది.ఢిల్లీ లిక్కర్ కేసులో మిగతా వారిని ఢిల్లీలో విచారించి కవితను మాత్రం అనుమతి కోరుతున్నారు.
ఇక్కడే అసలు విషయం ఏంటో తెలుస్తోంది.నిజంగా కేసీఆర్ అవినీతి చిట్టా బయట పెట్టాలంటే.
కోకాపేట భూములు, బంగారు కూలీ, ఇతర కేసులపై విచారణ చేపట్టాలి.
గతంలో ఎన్నికల కమిషన్ కు నేను చేసిన ఫిర్యాదులపై ఇప్పటికీ స్పందన లేదు.
ఢిల్లీలో అయిదు రోజులు ఎలక్షన్ కమిషన్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించినా ఇవ్వలేదు.డిసెంబర్ 6 లోపు స్పందించకపోతే ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు చెల్లకుండా పోతుంది.
తెలంగాణలో బెంగాల్ తరహా ప్రయోగం జరుగుతోంది.టీఆరెస్, బీజేపీ వార్ ఒక వీధి నాటకం.