పాలమూరు రాజకీయాల్లోకి యువ రక్తం... రేవంత్ అడుగులు ఎటువైపో....

పాలమూరు పోరాటాలకు పెట్టింది పేరు.పాలమూరు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసుకున్నా కానీ కాంగ్రెస్ ఆధిపత్యమే మనకు కనిపిస్తూ ఉంటుంది.

 Tpcc Revanth Reddy Interested To Join Young Leaders To Palamuru Politics Details-TeluguStop.com

ఈ మధ్య ఈ ఆధిపత్యం కాస్త తగ్గినా పాలమూరులో మళ్లీ పుంజుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది.అక్కడ పాగా వేసేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది.

ఈ సందర్భంగా అక్కడ ఉన్న యువ నేతలకు అవకాశాలు ఇవ్వాలని చూస్తోంది.

ఇందుకోసం యువరక్తాన్ని నమ్ముకుంటోంది.

మరి ఈ ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందో? ఎంత వరకు బెడిసి కొడుతుందో ఎవరికీ సరిగా తెలియకపోయినా కాంగ్రెస్ ప్రయత్నాలను మాత్రం తక్కువ చేయలేం.ఇలా కాంగ్రెస్ తనకు తోచిన విధంగా యువకులను బరిలోకి దించి సక్సెస్ కావాలని చూస్తోంది.మరేమవుతుందో…

పాలమూరు జిల్లాలో ఉన్న కాంగ్రెస్ ఈ సారి ఎలాగైనా సరే గెలిచి సత్తా చాటాలని ప్రయత్నాలు చేస్తోంది.ఇన్ని రోజులు పార్టీలో ఉన్న సీనియర్లను చాలా మందిని పక్కన బెట్టి జూనియర్లకు అవకాశాలు ఇవ్వాలని చూస్తోంది.

ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొత్తం 14 నియోజకవర్గాలు ఉండగా… ఈ సారి మెజార్టీ నాయకులు యువకులే ఉన్నారు.

ఈ సారి వనపర్తి సీటు కోసం యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనా రెడ్డి, జడ్చర్ల నుంచి కాంగ్రెస్ నియోజకవర్గ కో ఆర్డినేటర్ అనిరుధ్ రెడ్డి, షాద్ నగర్ నుంచి పీసీసీ కార్యదర్శి శంకర్, దేవరకద్ర నుంచి పీసీసీ కార్యదర్శి మధుసూదన్ రెడ్డి, కొల్లాపూర్ నుంచి అభిలాష్ రావు, మక్తల్ నుంచి జలంధర్ రెడ్డి, నారాయణ పేట నుంచి శివ కుమార్ రెడ్డి, నాగర్ కర్నూల్ నుంచి మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి తనయుడు నాగం శశిధర్ రెడ్డి సీటు ఆశిస్తూ బరిలో ఉన్నారు.మరి ఈ యువనేతలకు అవకాశం వరిస్తుందో లేదో వేచి చూడాలి.

Tpcc Revanth Reddy Interested To Join Young Leaders To Palamuru Politics Details, Congress, Revanth, Palamuru Politics, Young Politicians, Tpcc Revanth Reddy, Telangana Congress, Shivasena Reddy, Nagam Sashidhar Reddy, Madhusudhan Reddy - Telugu @revanth_anumula, Nagamsashidhar, Palamuru, Shivasena Reddy

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube