మళ్లీ తెరపైకి టి పీసీసీ అధ్యక్ష పదవి ! కాంగ్రెస్ లో కనువిప్పు ఎప్పుడో ?

తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త అధ్యక్షుడుని నియమిస్తామని ఎప్పటి నుంచో కాంగ్రెస్ అధిష్టానం ప్రకటనలు చేస్తూ వస్తోంది.ఎప్పటికప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నాయకులతో సంప్రదింపులు చేస్తూ , ఏకాభిప్రాయం సాధించేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ వచ్చింది.

 Congress, Telangana, Manikymam Tagore, Pcc President, Revanth Reddy, Uttam Kumar-TeluguStop.com

ఎవరిని ఎంపిక చేస్తే పార్టీకి మళ్ళీ పునర్జీవం పోయేగలరు  ? అధికార పార్టీ టిఆర్ఎస్ ను ధీటుగా ఎదుర్కొని రాబోయే రోజుల్లో పార్టీని ఎవరు అధికారంలోకి తీసుకురాగలరు ఇలా అనేక అంశాలపై కాంగ్రెస్ అధిష్టానం లోతుగానే ఆలోచిస్తూ వచ్చింది.ఈ నేపథ్యంలోనే తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పేరు ఎక్కువగా వినిపించింది.

 ప్రస్తుత అధ్యక్షుడు ఉత్తంకుమార్ రెడ్డి స్థానంలో ఆయన అయితేనే పార్టీని ముందుకు తీసుకు వెళ్ళగలరు అని భావించింది .అయితే మిగతా సీనియర్ల నుంచి తీవ్రమైన అభ్యంతరాలు రావడంతో పాటు,  వారంతా పార్టీని వీడేందుకు సిద్ధంం కావడంతో వెనక్కి తగ్గిందిిిి.అసలు ఈ పదవిని భర్తీ చేయాలి అంటే నే కత్తిమీద సాములా ఎప్పటికప్పుడు కాంగ్రెస్ అధిష్టానం వెనక్కి తగ్గుతూ వస్తుంది.మల్లు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిి, రేవంత్ రెడ్డిి, జానా రెడ్డి ,జీవన్ రెడ్డి , దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఇలా చెప్పుకుంటూ వెళితే ఎంతో మంది నాయకులు ఈ పదవిపై ఆశలు పెట్టుకున్నాారు.

వీరిలో ఎవరో ఒకరికి పదవి కట్టబెడితే మిగతావారంతా అసంతృప్తికి గురై , పార్టీకి నష్టం చేకూరుస్తారు అని  ఎప్పటికప్పుడు వాయిదా వేసుకుంటూనేే వస్తున్నారు.

Telugu Congress, Jana Reddy, Nagarjuna Sagar, Pcc, Revanth Reddy, Telangana-Telu

 తాజాగా మరోసారి ఈ వ్యవహారంపై కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఠాకూర్ స్పందించారు.నాగార్జున సాగర్ ఉప ఎన్నిక  పూర్తి కాగానే, కొత్త పిసిసి అధ్యక్షుడి ఎంపిక పూర్తి చేస్తామంటూ ఆయన ప్రకటన చేశారు.చాలా కాలంగా కొత్త పిసిసి అధ్యక్షుడి ఎంపిక విషయమై కాంగ్రెస్ నేతలంతా సైలెంట్ గానే ఉంటున్నారు.

అసలు ఆ సంగతి మరిచిపోయి మరి సమిష్టిగా నాగార్జునసాగర్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి జనా రెడ్డి గెలుపు కోసం ఈ నాయకులంతా కృషి చేస్తున్నారు మళ్లీ దీనిపై మాణిక్యం ఠాకూర్ ప్రకటన చేయడంతో ఎవరికివారు సొంతంగా రాజకీయాలు మొదలు పెట్టినట్లు గా వ్యవహరిస్తున్నారు.ఎప్పటి నుంచో వాయిదాల మీద వాయిదాలు వేసుకొంటూ వస్తున్న ఈ పిసిసి అధ్యక్ష పదవి విషయంలో,  కాంగ్రెస్ అధిష్ఠానం వీలైనంత తొందరగా ఈ పదవిని చేపట్టి పార్టీకి పునర్వైభవం తీసుకు వచ్చే విషయంపై దృష్టి సారించకపోతే, ముందు ముందు ఎన్నో రకాలుగా ఆ పార్టీ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఇప్పటికీ బిజెపి టిఆర్ఎస్ తో పాటు షర్మిల సైతం అధికారం కోసం శరవేగంగా రాజకీయాలు మొదలు పెట్టడంతో కాంగ్రెస్ ఇప్పటికైనా అప్రమత్తం కావాలని,  పార్టీని బలోపేతం చేసే విషయంపై దృష్టి పెట్టాలని కాంగ్రెస్ సీనియర్లు సూచిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube