వారందరినీ ఏరేసేందుకు చూస్తున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి..

Tpcc Chief Rewanth Reddy Is Looking To Elevate Them All

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ఏదీ ఈజీగా లభించడం లేదు.ఆయన పరిస్థితుల్ని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు చాలా ప్రయత్నిస్తున్నారు.

 Tpcc Chief Rewanth Reddy Is Looking To Elevate Them All-TeluguStop.com

ఎలాగైనా కాంగ్రెస్ లో తన మార్కును చూపేందుకు శ్రమిస్తున్నారు.ఇప్పటికే కాంగ్రెస్ లో రేవంత్ మార్కు రాజకీయాలను మనం చూస్తున్నాం.

కానీ ఇప్పుడు ఆయన పార్టీలోని సీనియర్లను వదిలిపెట్టి కిందిస్థాయిలో రెబల్ గా ఉండే నాయకులను ఏరేసే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది.ఎవరైతే కాంగ్రెస్ కు అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తూ ఇతర పార్టీల నాయకులకు కొమ్ము కాస్తుంటారో అటువంటి నేతల లిస్టును రేవంత్ రెడ్డి తెప్పించుకున్నట్లు తెలుస్తోంది.

 Tpcc Chief Rewanth Reddy Is Looking To Elevate Them All-వారందరినీ ఏరేసేందుకు చూస్తున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

త్వరలో వారందరినీ పార్టీ నుంచి తీసేస్తారని ప్రచారం కూడా జరుగుతోంది.

రేవంత్ రెడ్డి ప్రస్తుతం అన్ని జిల్లాల అధ్యక్షులతో వరుసగా భేటీలు అవుతున్నారు.

ఈ భేటీలకు చాలా ప్రాధాన్యత సంతరించుకుంది.ఈ భేటీలలో ఆయన రెబల్ నేతల గురించి ఆరా తీస్తున్నట్లు సమాచారం.

రేవంత్ రెడ్డి పార్టీ నుంచి తీసేసే వారి జాబితాలో తెలంగాణలోని కొన్ని జిల్లాల కాంగ్రెస్ అధ్యక్షులు కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.వారు అధ్యక్షులైనా, కార్యకర్తలైనా పార్టీకి నష్టం కలిగించే పని చేస్తుంటే వారిని తప్పకుండా తీసేయాల్సిందే అనే ఉద్దేశంలో రేవంత్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది.

అంటే రానున్న రోజుల్లో కొత్త కాంగ్రెస్ ను మనం చూడబోతున్నామన్న మాట.పార్టీలోని సీనియర్ నాయకులను ఏరేద్దాం అనుకుంటే ఏదో ఒక ఆటంకం వస్తుంది కావున చిన్న స్థాయి నాయకుల మీద రేవంత్ రెడ్డి కాన్సంట్రేట్ చేసినట్లు సమాచారం.కాంగ్రెస్ లో ఉంటూ వేరే పార్టీల నేతలతో అంటకాగుతున్న వారి వివరాలను కాంగ్రెస్ అధినేత రేవంత్ రెడ్డి సేకరిస్తున్నట్లు వారిపై త్వరలోనే వేటు పడే చాన్స్ ఉందని తెలుస్తోంది.భవిష్యత్ లో ఏమవుతుందో వేచి చూడాలి.

Video : TPCC Chief Rewanth Reddy Is Looking To Elevate Them All, Rewanth, Congress

#Congress #PCC #Congress #Senior #Rewanth

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube