' ఒక్క ఛాన్స్ ' అంటూ సెంటిమెంట్ రాజేస్తున్న రేవంత్ 

కాంగ్రెస్ ను తెలంగాణలో అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ప్రస్తుతం పాదయాత్ర చేస్తున్న రేవంత్ ప్రజల్లోకి కాంగ్రెస్ ను తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

 Tpcc Chief Revanth Reddy Asking For One Chance To Get Congress Party Into Power-TeluguStop.com

అధికార పార్టీ టిఆర్ఎస్ తప్పిదాలను హైలెట్ చేసి కాంగ్రెస్ పై జనాల చూపు పడేవిధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన పార్టీకి కనీసం ఒక్క ఛాన్స్ అయినా ఇవ్వాలంటూ రేవంత్ పదే పదే ప్రజలను కోరుతున్నారు.

పాదయాత్ర నిర్వహిస్తున్న ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ రేవంత్ ఈ నినాదాన్ని ఉపయోగిస్తూ జనాల్లో సెంటిమెంట్ ను రగిల్చే ప్రయత్నం చేస్తున్నారు.

Telugu Aicc, Brs, Congress, Haathse, Pcc, Revanth Reddy, Revanthreddy, Sonia Gan

” తెలంగాణ ఇవ్వడమే కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పా !  పదవుల కోసం కాదు ఆవేదనతో ఈ ప్రశ్న అడుగుతున్నా,  తెలంగాణ ఇవ్వడమే కాంగ్రెస్ చేసిన ద్రోహమా ? కాంగ్రెస్ పార్టీని ఎందుకు గెలిపించరు ? 1200 మంది యువకులు బలిదానాలకు చలించి ఏ అమ్మకు కడుపుకోత ఉండకూడదని సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు.రాజకీయంగా నష్టపోయినా,  సోనియాగాంధీ తెలంగాణ కు కలను సాకారం చేశారు .అంత గొప్పం త్యాగం చేస్తే సోనియాగాంధీ రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత తెలంగాణ సమాజం మీద లేదా అంటూ రేవంత్ పదేపదే ప్రశ్నిస్తున్నారు.రేవంత్ పాదయాత్ర జరుగుతున్న అన్నిచోట్ల ఇదే సెంటిమెంటును రగుల్చుతూ రేవంత్ ప్రజల్లో ఆలోచన రేకెత్తిస్తున్నారు.

Telugu Aicc, Brs, Congress, Haathse, Pcc, Revanth Reddy, Revanthreddy, Sonia Gan

ఈ సందర్భంగా బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేల పైన రేవంత్ ఫైర్ అవుతున్నారు.ఎమ్మెల్యేల అరాచకాలు చేస్తున్నారని ప్రజలకు చెబుతూ, స్థానికంగా నెలకొన్న సమస్యలను హైలెట్ చేస్తున్నారు.దీంతో పాటు అసలు కాంగ్రెస్ కు ఎందుకు ఓటు వేయాలి అనే విషయం పైన జనాలకు క్లారిటీగా చెబుతున్నారు.

తెలంగాణ ప్రజలు పూర్తిగా వ్యతిరేకిస్తున్న ధరణి పోర్టల్ తో పాటు,  ప్రతి పేదవాడికి ఇంటికి ఐదు లక్షలు చొప్పున ఆర్థిక సహాయం చేస్తామని , రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని , ఆరోగ్య భీమా పెంచుతామని,  రైతులకు పగటిపూట నాణ్యమైన ఉచిత విద్యుత్ ను అందిస్తామని, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు , ఆడబిడ్డలకు 500 కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని ఎలా ఎన్నో హామీలను ప్రజలకు ఇస్తూ వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube