Toyota Innova Hycross : ఇండియాలో టయోటా ఇన్నోవా హైక్రాస్ .. ఫీచర్స్ తెలిస్తే

దేశీయ మార్కెట్ లో ఎప్పటికప్పుడు కొత్త మోడల్ కార్లు వస్తూ ఉంటాయి.అధునాతన టెక్నాలజీతో, అరుదైన ఫీచర్లతో కార్లు లాంచ్ అవుతున్నాయి.

 Toyota Innova Hycross In India .. If You Know The Features ,9-unit Audio System-TeluguStop.com

తాజాగా మార్కెట్ లో టయోటా ఇన్నోవా హైక్రాస్ అడుగు పెట్టింది.చాలా అప్డేట్స్ తో నేటి ఆధునిక కాలంలో వినియోగించడానికి అనుకూలంగా రూపొందించారు.

మార్కెట్ లో అత్యంత ప్రజాదరణ పొందుతూ ముందుకు సాగుతున్న టయోటా 2015 వ సంవత్సరంలో క్వాలిస్ స్థానంలో ఇన్నోవాను తీసుకువచ్చింది.తిరుగులేని ఎమ్పీవీగా ప్రసిద్ధి చెందిన ఇన్నోవాలో కాలనుగుణంగా పలు మార్పులు చోటు చేసుకున్నారు.

ఈ నేపథ్యంలో 2016 లో ఇన్నోవా క్రిస్టా మార్కెట్ లోకి వచ్చింది.సుమారు ఆరు సంవత్సరాల తర్వాత మరిన్ని ఫిచర్లతో ఇటీవలే అడుగుపెట్టిన ఇన్నోవా హైక్రాస్ అత్యంత ప్రజాదరణ పొందుతుందనడంలో అతిశయోక్తి లేదు.

టయోటా కంపెనీకి చెందిన ప్రతి కారు కాలనుగుణంగా ఆధునిక ఇంటీరియర్ ఫీచర్స్ ను కలిగి ఉంటాయి.ఈ కారణంగానే ఇన్నోవా హైక్రాస్ లగ్జరీ అనుభూతిని అందిస్తుంది.మల్టి లేయర్ డ్యాష్ బోర్డు సాఫ్ట్ టచ్ మెటరీయిల్స్ పొందుతుంది.హైక్రాస్ పెద్ద 10.1 ఇంచెస్ ఇన్ఫోటైన్ మెంట్ డిస్ ప్లేను కలిగి ఉంటుంది.స్టీరింగ్ వీల్ వెనుక 7 అంగుళాల డ్రైవర్ డిస్ ప్లే రెండు వైపులా గేజ్ లతో అమర్చబడి ఉంటుంది.

ఇందులో ఎడమ వైపున హైబ్రిడ్ సిస్టమ్ గురించి వినియోగదారులకు వివరాలను అందిస్తుంది.టయోటా ఇన్నోవా హైక్రాస్ 8- వే పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, వెంటిలేషన్ ప్రంట్ సీట్లను కలిగి ఉంటుంది.9-యూనిట్ ఆడియో సిస్టమ్‌ కూడా అందుబాటులో ఉండటమే కాకుండా పనోరమిక్ సన్ రూప్ మరింత లగ్జరీ అనుభూతిని కలిగిస్తుంది.వరుస సీట్లు కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

Telugu Start, India, Cars, Airbags, Toyotainnova-Latest News - Telugu

కావున దూర ప్రయాణాల్లో కూడా ఎటువంటి ఇబ్బంది పడే అవకాశం ఉండదు.మల్టిపుల్ ఛార్జింగ్ పోర్ట్‌లు, రియర్ సన్‌షేడ్‌లు, ఎలక్ట్రోక్రోమిక్ IRVM, మల్టీ జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్‌లతో పాటు రిమోట్ ఇగ్నిషన్ స్టార్ట్/స్టాప్, రిమోట్ డోర్ లాక్/అన్‌లాక్, రిమోట్ AC కంట్రోల్, ఫోన్, స్మార్ట్‌వాచ్ ద్వారా కంట్రోల్ చేయడానికి అనుకూలంగా ఉండే దాదాపు 65 కి పైగా ఫీచర్స్ ఇందులో ఉన్నాయి.సేఫ్టీ విషయానికి వస్తే ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్, రివర్స్ పార్కింగ్ కెమెరా, ఫ్రంట్ , రియర్ పార్కింగ్ సెన్సార్లు వంటివన్నీ వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్థారిస్తాయి.అంతే కాకుండా టయోటా ఇన్నోవా హైక్రాస్ లో లేటెస్ట్ ADAS టెక్నాలజీ ఉంది.

కావున డిపార్చర్ వార్నింగ్, బ్లైండ్ స్పాట్ మానిటర్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ మరియు అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి లేటెస్ట్ ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి.

Telugu Start, India, Cars, Airbags, Toyotainnova-Latest News - Telugu

ఇన్నోవా హైక్రాస్ చాలా ఆధునికంగా ఉంటుంది.దీని ముందు భాగంలో పెద్ద హెక్సాగోనల్ గ్రిల్ కలిగి ఉండి ఎక్కువ క్రోమ్ ఉంటుంది.ట్రిపుల్ ఎల్ఈడీ లైట్స్, ఎల్ఈడీ పొజిషన్ ల్యాంప్ వంటి సౌకర్యాలతో పాటు పై భాగంలో గ్రిల్ కు రెండు వైపులా క్రోమ్ స్ట్రివ్ తో కూడిన ఎడ్జీ ర్యాప్ రౌండ్ హెడ్ ల్యాంప్ ను చూడొచ్చు.

ఇక కింది భాగంలో ట్రయాంగిల్ కటౌట్ కనిపిస్తుంది.డ్యూయల్ పర్పస్ ఎల్ఈడీ డీఆర్ఎల్ లు టర్న్ ఇండికేటర్ లుగా పని చేస్తాయి.అంతేకాకుండా నూతన ఇన్నోవా హైక్రాస్ సైడ్ ప్రొఫైల్ లో చంకీ వీల్ ఆర్చెస్ ఉన్నాయి.ఇది 225/20 ఆర్18 టైరులతో కూడిన పెద్ద 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ పొందుతాయి.

వెనుక ర్యాప్ రౌండ్ ఎల్ఈడీ టెయిట్ లైట్స్, ఇంటిగ్రెటేడ్ రూఫ్ స్పాయిలర్, టెయిల్ గేట్ పవర్డ్ యూనిట్ వంటి పలు ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

ఇన్నోవా హైక్రాస్ కొత్త మోనోకోక్ సెటప్ కలిగి ఉన్న నేపథ్యంలో పాత మోడల్స్ కంటే తేలికగా ఉన్న భావనను కలిగిస్తుంది.

దీంతో ట్రిపుల్ డిజిట్ వేగానికి సులభంగా చేరుకుంటుంది.అంతేకాకుండా మంచి సస్పెన్షన్ సెటప్ కలిగి ఉండటంతో ఎలాంటి రోడ్డులో అయినా చాలా సజావుగా ముందుకెళ్తుంది.దీంతో వాహనదారులు మంచి డ్రైవింగ్ అనుభూతిని పొందుతారు.ఇటీవలే మార్కెట్ లోకి వచ్చిన టయోటా ఇన్నోవా హైక్రాస్ ప్రస్తుతం రెండు పవర్ ట్రెయిన్ ల ఎంపిలతో వినియోగదారులకు అందుబాటులో ఉంది.2.0 లీటర్ పెట్రోల్, 2.0 లీటర్ అట్కిన్సన్ సైకిల్ ఇంజన్.ఇన్నోవా హైక్రాస్ సాధారణ 2.0 లీటర్ పెట్రోల్ మోడల్ 172 బిహెచ్‌పి పవర్, 205 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది.సీవీటీ గేర్‌బాక్స్‌తో జతచేయబడింది.150 బిహెచ్‌పి పవర్, 187 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేసే 2.0-లీటర్ అట్కిన్సన్ సైకిల్ ఇంజన్ 111 బిహెచ్‌పి పవర్, 206 ఎన్ఎమ్ టార్క్‌ అందించే ఎలక్ట్రిక్ మోటారును కలిగి ఉండి ఈ-సీవీటీ గేర్‌బాక్స్‌కు జత చేయబడి ఉంటుంది.మొత్తం అవుట్‌పుట్‌ 186 బిహెచ్‌పి కి పరిమితం చేయబడింది.టయోటా కంపెనీ నుంచి వచ్చిన ఇన్నోవా హైక్రాస్ నేటి ఆధునిక కాలానికి అనుగుణంగా రూపొందించబడింది.హైబ్రిడ్ పవర్ ట్రెయిన్ కలిగి, ఇంటీరియర్ లతో అందరినీ ఆకర్షిస్తుంది.కాగా ఈ ఎంపీవీ 2023 జనవరి ప్రారంభంలో అధికారికంగా విడుదల కానుంది.

వీటి ధరలు కూడా అప్పుడే వెల్లడి కానున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube