భారత మార్కెట్లోకి ఇన్నోవా క్రిస్టా 2023.. ధర, లేటెస్ట్ సేఫ్టీ ఫీచర్స్, ఇవే..!

ప్రముఖ వాహన తయారీ సంస్థ టయోటా నుండి ఇన్నోవా క్రిస్టా 2023 ను( Innova Crysta 2023 ) భారత మార్కెట్లోకి విడుదల చేసింది.2023 ఇన్నోవా క్రిస్టా G,GX,VX,ZX అనే నాలుగు ట్రిమ్ లలో కొనుగోలు దారులకు అందుబాటులో ఉంది.ఇన్నోవా క్రిస్టా 2023 లో సెవెన్ సీటర్, 8 సీటర్ కాన్ఫిగరేషన్లో అందుబాటులో ఉంది.ఇందులో ఫ్రంట్ గ్రిల్, రీ డిజైన్ చేసిన బంపర్, కొత్త ఫాగ్ లాంప్ హౌసింగ్ లాంటి సరికొత్త ఫీచర్లు చాలానే ఉన్నాయి.

 Toyota Innova Crysta 2023 Launched In India Details, Toyota ,innova Crysta 2023-TeluguStop.com

అంతేకాకుండా పవర్ డ్రైవర్ సీట్ అడ్జస్ట్మెంట్, మల్టీజోన్ క్లైమేట్ కంట్రోల్, రెండో వరుసలో వన్ టచ్ టంబుల్, యాంబియంట్ లైటింగ్, లెదర్ సీట్లు లతో డిజైన్ చేయబడింది.

గతంలో ఇన్నోవా క్రిస్టాలో 2.4 లీటర్ల డీజిల్ ఇంజిన్ కు కంపెనీ నిలిపివేసింది.కాగా 2.7 లీటర్ల పెట్రోల్ ఇంజన్ తో అందుబాటులో ఉండేది.కానీ ప్రస్తుతం భారత మార్కెట్లోకి అడుగుపెట్టిన ఇన్నోవా క్రిస్టా 2023 లో 2.4 లీటర్ల డీజిల్ ఇంజన్ మాన్యువల్ గేర్ బాక్స్ తో ఉంది.ఇందులో సేఫ్టీ ఫీచర్స్ ( Safety features ) ఎంతో ఉపయోగకరంగా తయారు చేయబడ్డాయి.

ఏడు ఎయిర్ బ్యాగులు, ఫ్రంట్ అండ్ రియల్ పార్కింగ్ సెన్సార్లు, ఎలక్ట్రానిక్ స్పెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ , త్రీ పాయింట్ సీట్ బెల్ట్ లాంటి వాటితో వినియోగదారులకు భద్రతను కల్పిస్తుంది.

ఇంకా 8 ఇంచుల టచ్ స్క్రీన్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే కనెక్టివిటీ సపోర్ట్ ఉంది.కానీ సైడ్ ప్రొఫైల్, రియల్ ప్రొఫైల్ మాత్రం అప్డేట్ కాలేదు.మొత్తంగా డిజైన్ విషయంలో పాత మోడల్ తో పోలిస్తే చిన్న చిన్న మార్పులు చేయడం జరిగింది.భారత మార్కెట్లో( India market ) టాప్ వేరియంట్ ఎక్స్ షోరూం ధర రూ.20.90 లక్షలు.ఫేస్ లిస్ట్ ప్రారంభ ధర రూ.19.13 లక్షలు గా ఇన్నోవా క్రిస్టా 2023 నాలుగు ట్రీమ్ లలో కొనుగోలుదారులకు అందుబాటులో ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube