టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఎన్నికల యుద్ధం...

తెలంగాణ రాష్ట్రంలో హోరుగా కురుస్తున్న కురుస్తున్న వర్షాల్లో సైతం రాజకీయ వేడిని పుట్టిస్తుంది.తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్, కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకుల మధ్య విమర్శల పర్వం కొనసాగుతోంది.ప్రత్యక్ష ప్రదర్శనలతో టిఆర్ఎస్ బిజెపిల మధ్య విమర్శలపర్వం ఎన్నికల యుద్ధాన్ని తలపిస్తుంది.2018 ముందస్తు ఎన్నికల్లో కే సీటుకు పరిమితమైన భారతీయ జనతా పార్టీ 2019 సార్వత్రిక ఎన్నికల్లో నాలుగు ఎంపీలు గెలుపొంది, తన ఓటింగ్ శాతాన్ని గణనీయంగా పెంచుకుంది.అంతేగాక నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం నుండి ఏకంగా సీఎం కెసిఆర్ కుమార్తె మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితను భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ఓడించి బిజెపి సత్తాను నిరూపించారు.తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలోదిన ఉత్తర తెలంగాణలోనే మూడు సీట్లు గెలుపొంది భారతీయ జనతా పార్టీ ఓ ప్రత్యేక శక్తిగా అవతరించింది.

 Tough Fight Between Trs And Bjp In Coming Elections Details, Trs , Bjp, Narendra-TeluguStop.com

ఆ తదుపరి జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థిని ఓడించి ఆ సీటును బిజెపి ఖాతాలో జమ చేసుకుంది.ఇక అప్పటినుండి తెలంగాణ రాష్ట్రంలో బిజెపి టీఆర్ఎస్ ల మధ్య యుద్ధ వాతావరణం ప్రారంభమైంది.

ఆ తదుపరి జరిగిన నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో బిజెపి అంతంత మాత్రము ఓట్లు సంపాదించినప్పటికీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో నాలుగు సీట్ల నుండి 40 సీట్లకు పైగా గెలుపొంది అధికార టీఆర్ఎస్ పార్టీకి సవాల్ విసిరింది.ఆ తదుపరి రాజకీయ కోణాలలో భాగంగా సీఎం కేసీఆర్ సీనియర్ మంత్రిగా ఉన్న ఈటెల రాజేందర్ ను మంత్రివర్గ పదవి నుండి భర్తరఫ్ చేసి ఆయనపై కేసులు పెట్టారు.

దీంతో తనకు ఆత్మగౌరవం ముఖ్యమని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఈటెల రాజేందర్ భారతీయ జనతా పార్టీలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థిని మట్టి కల్పించారు.

Telugu Amith Sha, Bandi Sanjay, Cm Kcr, Etela Rajender, Munugodu, Narendra Modi,

ఈటెల రాజేందర్ ను ఓడించేందుకు సీఎం కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతోపాటు పార్టీ శ్రేణులను రంగంలోకి దింపి దళిత బంధు లాంటి ప్రతిష్టాత్మక పథకాన్ని ప్రవేశపెట్టి హుజరాబాద్ లో అధికార టీఆర్ఎస్ పార్టీకి ఓటమి తప్పలేదు.హుజురాబాద్ బిజెపి గెలుపు తర్వాత భారతీయ జనతా పార్టీ దూకుడు మరింతగా పెంచింది.దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వరి పంచాయతీని తెరపైకి తెచ్చి సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపై యుద్ధాన్ని ప్రకటించారు.

అంతేగాక కేంద్ర ప్రభుత్వంపై నిరసన తెలిపేందుకు ఢిల్లీ వేదికగా దీక్షకు పూనుకున్నారు.భారతీయ జనతా పార్టీ సైతం ప్రజా సమస్యలను ఎండగట్టడానికి తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో పాదయాత్రకు శ్రీకారం చుట్టారు.

Telugu Amith Sha, Bandi Sanjay, Cm Kcr, Etela Rajender, Munugodu, Narendra Modi,

మొదటి విడత పాదయాత్ర సక్సెస్ కావడంతో రెండో విడత పాదయాత్రను సైతం కొనసాగించారు.ఆ తదుపరి హైదరాబాద్ కేంద్రంగా భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగడం ఆ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే రాష్ట్రపతి ఎన్నికలు రావడం రాష్ట్రపతి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా తృతీయ కూటమి అభ్యర్థి యశ్వంత్ సిన్హా కు సీఎం కేసీఆర్ మద్దతు ప్రకటించారు.ఆ ఎన్నికల్లో కేసీఆర్ మద్దతు ప్రకటించిన అభ్యర్థి ఓడిపోయినప్పటికీ మొక్కవోని విశ్వాసంతో సీఎం కేసీఆర్ కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ చేపట్టే కార్యక్రమాలు ప్రజా వ్యతిరేకంగా ఉన్నాయని దేశంలోని బిజెపి వ్యతిరేక శక్తులను ఏకం చేసేందుకు దేశ పర్యటనకు శ్రీకారం చుట్టారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube