వైర‌ల్‌.. పిల్లిని ఓ ఆటాడుకున్న తాబేలు..

Tortoise Playing With A Cat

నెట్టింట వైర‌ల్ అయ్యే వీడియోల్లో ఎక్కువ‌గా జంతువుల‌కు సంబంధించిన‌వే ఉంటాయ‌న్న విష‌యం విధిత‌మే.అయితే ఇప్పుడు మాత్రం ఓ వీడియో ఇలాగే తెగ న‌వ్వింస్తోంది.

 Tortoise Playing With A Cat-TeluguStop.com

ఇది కూడా జంతువుల‌కు సంబంధించిందేనండోయ్‌.కాక‌పోతే ఇది కొంచెం డిఫ‌రెంట్ యాంగిల్ లో ఉంది.

నిజానికి సోష‌ల్ మీడియాలో ఇలాంటి వీడియోలు కొత్తేమీ కాక‌పోయినా.ఇది త‌న వంతు ప్ర‌య‌త్నంగా మ‌న‌ల్ని న‌వ్విస్తోంది.

 Tortoise Playing With A Cat-వైర‌ల్‌.. పిల్లిని ఓ ఆటాడుకున్న తాబేలు..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇందులో ఓ తాబేలు, ఓ పిల్లిని ఆటాడుకోవ‌డం మ‌న‌కు క‌నిపిస్తుంది.దీన్నంతా కూడా కొంద‌రు వీడియో తీయ‌గా వైర‌ల్ గా మారింది.

తాబేలు అన‌గానే అంద‌రికీ గుర్తొచ్చేది నీళ్లు మాత్ర‌మే.ఎందుకంటే అవి నిత్యం నీటిలోనే ఉంటాయి.

సాధార‌ణంగా అవి బ‌య‌ట పెద్ద‌గా క‌నిపించ‌వు.నీటిలో ఉన్నంత యాక్టివ్ గా అవి బ‌య‌ట అస్స‌లు క‌ద‌ల‌వు.

కానీ ఇప్పుడు మేం చెప్ప‌బోయే వీడియోలో మాత్రం అనూహ్యంగా ఓ తాబేలు తెగ హ‌ల్ చ‌ల్ చేస్తోంది.నాకు అడ్డు వ‌చ్చేది ఎవ‌డ్రా అన్న‌ట్టు ప్ర‌వ‌ర్తిస్తోంది.

ఈ వైర‌ల్ వీడియోలో ఓ పిల్లి ప్ర‌శాంతంగా ఓ చోట కూర్చుని త‌న ప‌ని ఏదో తాను చేసుకుంటున్న‌ట్టు మ‌న‌కు క‌నిపిస్తుంది.అయితే ఎక్క‌డి నుంచి వ‌చ్చిందో తెలీదు గానీ స‌డెన్ గా ఓ రాకాసి తాబేలు అక్క‌డ‌కు ఎంట్రీ ఇచ్చేసింది.

ఇక మెల్లిగా వ‌స్తున్న ఆ తాబేలును చూసి పిల్లి పెద్ద‌గా స్పందించ‌లేదు.ఎందుకంటే అది త‌న వ‌ర‌కు వ‌స్తుంద‌ని ఆ పిల్లి ఊహించ‌లేదు.కానీ మెల్లిమెల్లిగా ఆ తాబేలు పిల్లిని చేరుకుంది.అయినా స‌రే పిల్లి మాత్రం జంక‌లేదు.త‌న జోలికి రాదులే అనుకుంది.కానీ ఒక్క‌సారిగా ఆ తాబేలు పిల్లి మీద అటాక్ చేసింది.

దీంతో హడలెత్తిపోయిన పిల్లి తాబేలు దెబ్బ‌కు బెంబేలెత్తిపోయింది.ఒక్క ఉదుట‌న అక్క‌డి నుంచి పరుగులు పెట్టింది.

ఇదంతా కొంద‌రు వీడియో తీయ‌గా దానిపై నెటిజ‌న్లు చాలా ఫ‌న్నీగా కామెంట్లు పెడుతూ లైక్స్ కొడుతున్నారు.

#Tortoise Attack #Socila

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube