వైరల్ అవుతున్న తాబేలు కథ.. ఏంటంటే?

మనకు తాబేలు కథ తెలుసు.అది ఎంత నెమ్మదిగా నడుస్తుంది అనేది కూడా తెలుసు.

 Tortoise Missing 74 Days Spotted Hardly One Mile Away Home Us  Tortoise, One Mil-TeluguStop.com

ఇంకా అలాంటి తాబేలు కధే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఏంటి అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్న.అమెరికాలోని టెన్నెస్సీ రాష్ట్రంలోని యాష్లాండ్ సిటీకి చెందిన లిన్ కోల్ అనే ఓ మహిళ ఓ తాబేలును పెంచుకుంటుంది.

అయితే ఏమైందో.

ఎలా తప్పించుకుందో తెలియదు కానీ 15 ఏళ్ల ఆ తాబేలు రెండు నెలల క్రితం తప్పిపోయింది.దీంతో ఆ తాబేలు యజమాని దాని కోసం వెతకని చోటు లేదు.

ప్రతి చోటా పోస్టర్ వేసి తాబేలు కోసం వెతకడం ప్రారంభించింది.ఎన్ని రోజులు వెతికిన ఆ తాబేలు కనిపించకుండా పోవడంతో ఇకపై అది దొరకదు అని వారు ఫిక్స్ అయ్యారు.

అయితే ఇంతలోనే ఆ తాబేలు ఓ వ్యక్తికి కనిపించింది.దానికి సంబందించిన పోస్టర్ కూడా అతను చూశాడు.ఇంకేముంది ఆమెకు ఫోన్ చేసి ఇంటికి వెళ్లి తాబేలును ఆమె కు అప్పజెప్పాడు.ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయింది.ఇక్కడ మరో విషయం ఏంటంటే.68 కిలోలు ఉన్న ఓ తాబేలు 74 రోజులు పాటు కనిపించకుండా పోయింది.కానీ అది కేవలం ఒక మైలు దూరం మాత్రం కూడా పరుగెత్తలేకపోయింది.ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube