తాబేలు చూసారా కుక్కను ఎన్ని తిప్పలు పెట్టిందో.. పాపం ఒకటే ఏడుపు..వీడియో వైరల్!

మనలో అందరు కుందేలు, తాబేలు కథ వినే ఉంటారు.ఎంత తెలివిగా తాబేలు కుందేలు ను ఓడించిందో ఈ కథ ద్వారా మనకు తెలిసిందే.

 Tortoise Attack On Dog By Biting Its Leg Viral On Social Media Details,dog Vs To-TeluguStop.com

మరోసారి తాబేలు తనను తక్కువ అంచనా వేయవద్దని నిరూపించింది.తాబేలు చూడడానికి నెమ్మదిగా ఉంటుంది కానీ దాని వెనుక చాలా తెలివి ఉంటుంది అనేది నిజం.

ఇది తెలియకుండా తాబేలును తక్కువ అంచనా వేస్తే మొదటికే మోసం వస్తుందని ఈ వీడియో చుస్తే తెలుస్తుంది.

కుక్క ఒక తాబేలును చూసి ఏడవడం ఏంటో.

ఇది వింత కాకపోతే మరేంటి.ఇలాంటి విచిత్రమైన సంఘటనలు ఈ మధ్య చాలానే జరుగుతున్నాయి.

తాజాగా ఒక తాబేలు కుక్కపై దాడి చేసి కుక్కను ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించింది.తాబేలు తనని తాను రక్షించు కోవడం కోసం దానికి బలమైన షెల్ ఇచ్చాడు దేవుడు.తాబేలు తన తల, కాళ్ళను డిప్పలో దాచేసుకుని తనని తాను రక్షించుకుంటుంది.

11 సెకన్ల ఈ వీడియోలో ఒక తాబేలు ను తక్కువ అంచనా వేసిన ఒక కుక్క దాని దాటికి కుయ్యో మొర్రో అంటూ ఏడవల్సిన పరిస్థితి ఏర్పడింది.తాబేలు దగ్గర ఒక కుక్క వచ్చి నిలబడింది.

వెంటనే తాబేలు.కుక్క కాలి వేలును నోటితో కరిచి పట్టుకుంది.దాంతో కుక్క వెంటనే కుయ్యిమంటూ మొత్తుకుంది.

దాని కాలు తీసుకోవడానికి ఎంత ప్రయత్నించినా తాబేలు అస్సలు వదులలేదు.

కుక్క కాలు వేలుని ఎంతసేపటికి వదలకుండా తాబేలు కుక్కను ఒక ఆట ఆడుకుంది.

కుక్క దాడి చేయాలనీ ప్రయత్నించినా తాబేలు దాని షెల్ లో ముడుచుకుని పోతూ కుక్కను ఏడిపించింది.ఏడవడం తప్ప ఆ కుక్కకు ఏమి చేయలేని పరిస్థితి.

యూట్యూబ్ లో అప్ లోడ్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.అయితే ఈ వీడియో పూర్తిగా లేదు.

అందుకే చివరకు తాబేలు ఎంత సేపటికి కుక్క కాలును వదిలేసిందో తెలియలేదు.ఈ వీడియో చూసాక తాబేలును తక్కువ అంచనా వేయకూడదు అని అర్ధం అవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube