ఇన్‌స్టంట్ కాఫీ పొడి గడ్డకట్టకుండా ఉండాలంటే…బెస్ట్ టిప్   Top Tips For Coffee Storage     2018-01-26   22:06:47  IST  Lakshmi P

కాఫీ పొడి గడ్డకట్టకుండా ఉండాలంటే….కాఫీ పొడిని గాలి చొరబడని సీసాలో పోసి డీప్ ఫ్రిజ్ లో పెట్టాలి.

విజిటెబుల్ స్టాక్ ని నిల్వ చేసుకోవాలంటే… టమోటా,పాలకూర ఎలా ఏ కూరగాయలతో అయిన చిక్కటి స్టాక్ తయారుచేసుకొని చల్లార్చి ఐస్ ట్రే లలో పోసి డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టాలి. క్యూబ్స్ గట్టి పడిన తర్వాత క్యూబ్స్ తీసి కవర్ లో వేసి గాలి వెళ్లకుండా ప్యాక్ చేసి ఫ్రిజ్ లో పెట్టుకుంటే అవసరమైనప్పుడు వాడుకోవచ్చు.

ఉల్లిపాయల పేస్ట్ ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే….ఉల్లిపాయ ముక్కలను మిక్సీ చేసేటప్పుడు కొంచెం నూనె వేయాలి. ఇలా నూనె వేయటం వలన ఉల్లిపాయ పేస్ట్ ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది.

ఎర్ర కారం ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే కారం డబ్బాలో కొంచెం ఇంగువ ముక్క వేయాలి.

ఉప్పు తడిగా మారకుండా ఉండాలంటే ఉప్పులో ఒక స్పూన్ మొక్కజొన్న పిండిని కలపాలి.

బిస్కెట్స్ నిల్వ చేసే డబ్బాలో అడుగున బ్లాటింగ్ పేపర్ వేస్తె బిస్కెట్స్ మెత్తపడకుండా కరకరలాడుతూ ఉంటాయి.

పచ్చడి బూజు పట్టకుండా ఉండాలంటే….పచ్చడి జాడీలో ఇంగువను కాల్చి పెట్టి అరగంట అయ్యాక తీసేసి అప్పుడు జాడీలో పచ్చడి పెట్టాలి. అప్పుడు పచ్చడి బూజు పట్టకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది.

ఇడ్లి పిండి రుబ్బేటప్పుడు గుప్పెడు అటుకులను వేస్తె ఇడ్లిలు మృదువుగా వస్తాయి.

బఠాణీలను ఉడికించేటప్పుడు చిటికెడు వంటసోడా వేస్తె తొందరగా ఉడకటమే కాకుండా రంగు కూడా మారదు.

వంటగదిలో చీమలతో ఇబ్బంది పడుతున్నారా… అయితే చీమలు తిరిగే ప్రదేశంలో దోసకాయ ముక్కలను పెట్టండి.