ఓటిటి ల వైపు పరుగులు తీసుకున్న అగ్ర కథానాయకులు..!

భారతదేశంలోకి కరోనా వైరస్  వచ్చిన తర్వాత దాదాపు అన్ని డిజిటల్ ప్లాట్ ఫామ్స్ కు బాగా డిమాండ్ పెరిగింది.ఈ క్రమంలో ప్రేక్షకులు అందరూ కూడా ఓటిటి లపై మగ్గు చూపడంతో వ్యాపార సామ్రాజ్యాలను బాగా డెవలప్ చేసుకున్నాయి.

 Top Protagonists Who Have Run Towards Otts-TeluguStop.com

దర్శక నిర్మాతలు కూడా థియేటర్లలో సినిమా రిలీజ్ అయినా అవ్వకపోయిన కానీ  ఓటిటిలో విడుదల అయితే చాలు అని అనుకుంటున్నారు.ఈ క్రమంలో ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ విజృంభిస్తున్న తరుణంలో దర్శక నిర్మాతలు సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లో కూడా దృష్టి కొనసాగించారు.

కేవలం దర్శక నిర్మాతలే కాకుండా హీరోయిన్ లు కూడా ఓటిటి వైపే దృష్టి కొనసాగించాలంటే నమ్మండి.ఇక కరోనా సెకండ్ వేవ్ విజృబిస్తున్న తరుణంలో థియేటర్ లలో 50% కెపాసిటీ అమలు, మరో వైపు ప్రేక్షలుకు ఎవరు  థియేటర్లకు వెళ్ళే సాహసం చేయకపోవడంతో, కొన్ని ప్రాంతాలలో స్వచ్ఛందంగా థియేటర్లు మూసివేసి ఉన్నారు.

 Top Protagonists Who Have Run Towards Otts-ఓటిటి ల వైపు పరుగులు తీసుకున్న అగ్ర కథానాయకులు..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలో ఓటిటి ప్లాట్ఫామ్స్ పై మరింత దృష్టి కొనసాగించారు ప్రజలు.ఇక మన టాప్ తెలుగు హీరోయిన్స్ కీర్తి సురేష్, తమన్నా, కాజల్, త్రిష, నయనతార, సమంత లాంటి వారు కూడా ఓటిటి పై దృష్టి  కొనసాగించడం ప్రేక్షకులను ఎంతగానో అక్కటుకుంది.

ఈ క్రమంలో మహానటి కీర్తి సురేష్ నటించిన మిస్ ఇండియా, పెంగ్విన్ థియేటర్లలో విడుదల అవ్వకుండా  డైరెక్ట్ గా వెబ్ సిరీస్ లోనే విడుదల అయ్యింది.అలాగే మిల్కీ బ్యూటీ తమన్నా నటించిన ‘11 అవర్‘ కూడా ఓటిటిలో ప్రేక్షలకులను  ఎంతగానో ఆకట్టుకుంది.

మరోవైపు నయనతార నటించిన “నెట్రికన్ ” అమెజాన్ ప్రైమ్ లో విడుదలకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.ఈ వెబ్ సిరీస్ లో నయనతార ప్రతీకారం తీర్చుకునే అంధ మహిళ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

మరోవైపు త్రిష నటిస్తున్న `పరమపాదమ్ విలయాట్టు`  ఇటీవల హాట్ స్టార్ లో విడుదలై ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.దీని తర్వాత త్రిష ‘ రాంగి ‘ అనే సినిమా కూడా డిజిటల్ స్ట్రీమింగ్ సిద్ధమవుతుంది.

ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్.ఈ సినిమా కూడా హాట్ స్టార్ లోనే విడుదల అవుతున్నట్లు సమాచారం.

మరోవైపు సమంత నటించిన  ‘ద ఫ్యామిలీమ్యాన్ – 2’ కూడా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.మన తెలుగు టాప్ హీరోయిన్స్ అందరూ కూడా ఓటిటి బాట పడుతూ విజయాలను సొంతం చేసుకుంటున్నారు.

మరి ఇక వీరి బాటలో ఇంకెంత మంది హీరోయిన్స్, హీరోలు చేరుతారో  చూడాలి మరి.

#Heroins #Hot Star #Amazon Prime #Directors #Succes

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు