కండల వీరుడు గురించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించిన సాజిద్

నిత్యం డేటింగ్,రిలేషన్ షిప్స్ తో బిజీ గా ఉండి బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ గా పేరు పొందిన బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గురించిన ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు బాలీవుడ్ నిర్మాత సాజిద్ నదియాడ్ వాలా.ప్రఖ్యాత టీవీ కార్యక్రమం కపిల్ శర్మ షో లో పాల్గొన్న సాజిద్,సల్మాల్ ఖాన్ పెళ్లి ప్రస్తావన గురించి చర్చ రావడం తో సల్లు భాయ్ జీవితంలో జరిగిన ఒక విషయాన్ని సాజిద్ తెలిపారు.53 ఏళ్ల వయసు వచ్చినా ఇంకా బ్యాచిలర్ గానే నడిపిస్తున్న సల్మాన్ ఒకప్పుడు పెళ్లి పీటల వరకు వచ్చిన తన పెళ్లిని సల్మాన్ మూడ్ లేదంటూ రద్దు చేసుకున్నారు అని సాజిద్ తెలిపారు.బాలీవుడ్‌లో సీనియర్ నిర్మాతగా పేరుపొందిన సాజిద్ నదియాడ్ వాలాకు సల్మాన్ ఖాన్‌తో మంచి అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే.‘1999లో సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకోవాల్సిన టైమ్ వచ్చింది.పెళ్లికూతురు కూడా సిద్ధంగా ఉంది.

 Top Producer Sajid Shares About Salman Khan Wedding-TeluguStop.com

నా కోసం ఓ అమ్మాయిని వెతుక్కోవాలి.సల్మాన్ తండ్రి పుట్టిన రోజు నవంబర్ 18.ఆ రోజే పెళ్లిచేసుకోవాలని మేం అనుకున్నాం.’ అని సాజిద్ తెలిపారు.

అయితే, సల్మాన్‌తో పెళ్లి మిస్ అయిన ఆ యువతి ఎవరనే విషయాన్ని మాత్రం సాజిద్ వెల్లడించలేదు.అయితే గతంలో సల్మాన్ కూడా నటి సంగీత బిజిలానీ తో తన పెళ్లి పీటల వరకు వచ్చి ఆగిపోయింది అని చెప్పిన విషయం తెలిసిందే.

Telugu Bollywoodkhan, Sajid, Salmankhan, Topsajid-

 

అయితే సాజిద్ షేర్ చేసిన విషయం చూస్తుంటే ఆ యువతి సంగీత బిజిలానీ అని అర్ధం అవుతుంది.సంగీత ఆ తరువాత ప్రముఖ క్రికెటర్ అజారుద్దీన్ ని వివాహం చేసుకొని సెటిల్ అయిన విషయం విదితమే.చాలా కాలం కత్రినా కైఫ్‌తో రిలేషన్ షిప్‌లో ఉన్న సల్మాన్ ప్రస్తుతం సింగర్ లూలియా వంతుర్‌తో డేటింగ్ చేస్తున్నట్టు బాలీవుడ్ లో టాక్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube