హీరో రామ్ ని డబ్బు కోసం బ్లాక్ మేయిల్ చేసిన బడా నిర్మాత   Top Producer Blackmailed Hero Ram For Money     2017-10-25   02:31:19  IST  Raghu V

నిర్మాత బెల్లంకొండ ఈమధ్య వార్తల్లో పెద్దగా కనిపించడం లేదని అనుకుంటుండగా, ఓ సంచలనాత్మక విషయాన్ని మీడియాకి ఐటమ్ గా ఇచ్చేసారు ఈ నిర్మాత. అది కూడా ఒక క్రేజి హీరోని బ్లాక్ మేయిల్ చేసి. ఆ హీరో ఎవరో, ఆ సంగతి ఏంటో చూడండి.

బెల్లంకొండ సురేష్ నిర్మాణంలో రామ్ కందిరీగ అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం చాలా పెద్ద సక్సెస్ ని రుచి చూసి మంచి లాభాలను తెచ్చిపెట్టింది‌. అప్పట్లోనే దాదాపుగా 18-20 కోట్ల షేర్ వసూళ్ళు సాధించింది. దాంతో బెల్లంకొండ రామ్ తో మరో సినిమా చేయాలని డిసైడ్ అయిపోయి, రామ్ కి కోటి రూపాయల అడ్వాన్స్ ఇచ్చారట‌.

కందిరీగ కాంబినేషన్ ని రిపీట్ చేసి, అదే సక్సెస్ ని సొంతం చేసుకోవాలని మళ్ళీ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలోనే రామ్ తో సినిమా ప్లాన్ చేసారు బెల్లంకొండ. కాని అర్థాంతరంగా ఆ ప్రాజెక్టు లోంచి రామ్ ని తప్పించి, ఎన్టీఆర్ ని తీసుకొచ్చారు. ఆ సినిమానే రభస. తీరా ఆ సినిమా విడుదలయ్యాక డిజాస్టర్ గా నిలిచింది అనుకోండి, అది వేరే విషయం.

ఏళ్ళు గడిచిపోయాయి కాని, రామ్ బెల్లంకొండ కలిసి మళ్ళీ సినిమా తీయలేదు. ఆ కోటి రూపాయల అడ్వాన్స్ కూడా అలానే రామ్ దగ్గరే ఉండిపోయింది. ఇప్పుడు సడెన్ గా, ఆ కోటి రూపాయలు కావాలని రామ్ ని డిమాండ్ చేసారట బెల్లంకొండ. అక్కడితో ఆగకుండా, కోటి రూపాయలు వెంటనే ఇవ్వకపోతే విడుదలకి సిద్ధంగా ఉన్న “ఉన్నది ఒకటే జిందగీ” విడుదల కాకుండా అడ్టుకుంటానని బ్లాక్ మేయిల్ చేసారట. సినిమా రిలీజ్ టైమ్ లో గొడవలు ఎందుకని రామ్ ఆ కోటి రూపాయలు వెనక్కి ఇచ్చేయడంతో వివాదం సద్దుమణిగింది.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.