టక్ జగదీష్ రైట్స్‌ను దక్కించుకున్న స్టార్ ప్రొడ్యూసర్.. ఎవరంటే?

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘టక్ జగదీష్’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.ఈ సినిమాతో మరోసారి తనదైన మార్క్ వేసేందుకు నాని రెడీ అవుతున్నాడు.

 Top Producer Acquires Nani Tuck Jagadish Rights, Nani, Tuck Jagadish, Shiva Nirw-TeluguStop.com

ఈ సినిమాను దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.నాని నటించిన రీసెంట్ మూవీ ‘వి’ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయ్యి మిక్సిడ్ టాక్‌ను సొంతం చేసుకుంది.

దీంతో ‘టక్ జగదీష్’తో అదిరిపోయే హిట్ అందుకునేందుకు నాని ప్లాన్ చేస్తున్నాడు.
అయితే ఇంకా షూటింగ్ కూడా పూర్తి చేసుకోని టక్ జగదీష్ చిత్రం అప్పుడే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.

ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్, నాన్-థియేట్రికల్ రైట్స్‌ను చిత్ర యూనిట్ భారీ రేటుకు అమ్మేసినట్లు తెలుస్తోంది.టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నిర్మాత ఈ చిత్ర హక్కులను హోల్‌సేల్‌గా దక్కించుకున్నాడట.ఈ సినిమా హక్కులను రూ.47 కోట్ల భారీ రేటుకు సదరు నిర్మాత దక్కించుకున్నాడట.ఇక ఈ సినిమాను పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో కూడా మంచి హైప్ క్రియేట్ అయ్యింది.

ఇక నాని ఈ సినిమాలో స్టైలిష్ లుక్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది.

కాగా ఈ సినిమాలో ‘పెళ్లిచూపులు’ బ్యూటీ రీతూ వర్మ హీరోయిన్‌గా నటిస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాతో నాని మరోసారి తనదైన మార్క్ వేసుకునేందుకు రెడీ అవుతున్నాడు.

మరి టక్ జగదీష్ చిత్రం నానికి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో తెలియాలంటే మాత్రం ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.ఇక ఈ సినిమాను వీలైనంత త్వరగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube