ట్రంప్ పై ఫైర్ అవుతున్న ఐటీ దిగ్గజ సంస్థలు..     2018-11-11   08:24:57  IST  Sai Mallula

అమెరికా అధ్యక్షుడికి ఐటీ దిగ్గజాలు షాక్ ఇచ్చాయి..ట్రంప్ విధానాల వలన కంపెనీలకి నష్టం వాటిల్లుతోంది అంటూ ఫైర్ అవుతున్నాయి..మీ చర్యలు మా కంపెనీలకి శరాఘాతం అవుతున్నాయి అంటూ ఓ లేఖని సంధించాయి.గత కొంతకాలంగా ట్రంప్ హెచ్‌-1బీ వీసాల విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలు ఎంతో మందిని కలిచివేస్తున్నాయి. అమెరికా కోరికని విదేశీయులకి దూరం చేస్తూ అమెరికాలో

Top IT Companies Fires On Trump-

Top IT Companies Fires On Trump

ఉద్యోగాలు తమ సొంత పౌరులకి ఇవ్వాలనే ఉద్దేశ్యంతోనే ట్రంప్ ఈ విధంగా చర్యలు చేపట్టడం ఎంతో దారుణమైన విషయం అయితే. తాజాగా వీసాల విషయంలో కొత్తగా చేర్చిన లేబర్ సర్టిఫికెట్ విధానంపై విసుగెత్తిన దిగ్గజ ఐటీలు ట్రంప్ చర్యలపై స్పందిచాయి…తన చట్టపరిధిని మించి ప్రభుత్వం వ్యవహరిస్తోందంటూ గూగుల్‌, ఫేస్‌బుక్‌, మైక్రోసాఫ్ట్‌ సంస్థలు ధ్వజమెత్తాయి. ఈమేరకు హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ విభాగానికి లేఖ రాశాయి.

Top IT Companies Fires On Trump-

లేబర్ డిపార్ట్ మెంట్ ఆమోదముద్ర వేసిన తర్వాతే హెచ్1-బీ వీసాతో కంపెనీ విదేశీ ఉద్యోగిని నియమించాల్సి వస్తుంది. ట్రంప్ సర్కార్ తీసుకున్న ఈ చర్యతో కంపెనీలకు కొత్త విదేశీ ఉద్యోగుల నియామకాలలో కష్టాలు ఎదురవుతాయని..ఈ నేపథ్యంలో తాజా నిర్ణయంపై తక్షణం పునరాలోచన చేయాలని ఆ లేఖలో గూగుల్‌, ఫేస్‌బుక్‌, మైక్రోసాఫ్ట్ కంపెనీలు కోరాయి…అమెరికాకి ఆర్థికంగా వెన్ను దన్నుగా నిలిచే ఈ ఐటీ కంపెనీలు ఇప్పుడు ఫైర్ అవ్వడంతో ట్రంప్ ఎలాంటి ఆలోచన చేస్తారో వేచి చూడాలి.