ఏ పరిశ్రమకు చెందిన సినిమా నటులైనా హాలీవుడ్ లో నటించాలని కోరుకుంటారు.హాలీవుడ్ లో అవకాశం వస్తే ఎగిరి గంతేస్తారు.
చాలా మంది బాలీవుడ్ తారాలు సైతం హాలీవుడ్ లో సినిమాలు చేసి బాగా సక్సెస్ అయ్యారు.కానీ కొందరు బాలీవుడ్ తారలు తమకు హాలీవుడ్ అవకాశాలు వచ్చినా.
వదులుకున్నారు.ఇంతకీ వారెవరో ఇప్పుడు చూద్దాం.
గోవిందా
బాలీవుడ్ లో ఒకప్పుడు టాప్ హీరోగా కొనసాగాడు గోవింద.మంచి కామెడీతో సూర్ హిట్ సినిమాలు చేశాడు.ఆ సమయంలో గోవిందాకు జేమ్స్ కెమెరూన్ తెరకెక్కించిన అమెరికన్ ఎపిక్ సైన్స్ ఫిక్షన్ చిత్రం అవతార్ లో నటించే అవకాశం దక్కింది.కానీ.పలు కారణాలతో ఆయన నో చెప్పాడు.
షారుఖ్ ఖాన్
స్లమ్‌డాగ్ మిలియనీర్ సినిమా గురించి తెలియని వారుండరు.అస్కార్ అవార్డుల పంట పండించిన ఈ సినిమాలో రియాలిటీ షో హోస్ట్ గా అనిల్ కపూర్ నటించాడు.నిజానికి ఈ పాత్రను షారుఖ్ ఖాన్ చేయాల్సి ఉంది.
కానీ కారణాలు ఏంటో తెలియదు కానీ ఈ సినిమాను వదులుకున్నాడు.తనను ఆ పాత్రలో జనాలు ఆదరించరనే అనుమానంతో తప్పుకున్నట్లు షారుఖ్ చెప్పాడు.
దీపికా పదుకొనే
హాలీవుడ్ తెర మీద ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ లాంటి మోస్ట్ సక్సెస్ ఫుల్ ఫిల్మ్ సిరీస్ లో నటించే అవకాశం వచ్చినా దీపికా వదులుకుంది.ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సిరీస్ 7లో దీపికా నటించాల్సింది.కానీ అప్పుడు బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ రామ్ లీలాలో నటిస్తున్న కారణంగా ఆ ప్రాజెక్టును మధ్యలో వదిలేయడం ఇష్టంలేక దీపికా హాలీవుడ్ అవకాశాన్ని వదులుకుంది.
నసీరుద్దీన్ షా
బాలీవుడ్ టాప్ స్టార్ నసీరుద్దీన్ షా హాలీవుడ్ భారీ ఆఫర్ ను తిరస్కరించాడు.హ్యారీ పోర్టర్ సిరీస్ లో రిచర్ హారిస్ పోషించిన డంబుల్డోర్ పాత్ర గురించి మర్చిపోలేరు.అయితే, మొదటి రెండు భాగాల తర్వాత హ్యారిస్ మరణించాడు.
ఆ తర్వాత ఆ పాత్ర కోసం నసీరుద్దీన్ షాను సంప్రదించారు.కానీ తను నో చెప్పారట.
ఇర్ఫాన్ ఖాన్
స్టీవెన్ స్పీల్బర్గ్ ఇంటర్ స్టెల్లెర్ మూవీకి నో చెప్పాడు ఇర్ఫాన్ ఖాన్.ఈ సినిమాలో తనకు తగినంత స్కోప్ ఇవ్వలేదని.ముందు అనుకున్న పాత్రలో మార్పులు చేశారనే వదులుకున్నట్లుగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.ఆ తర్వాత బాడీ ఆఫ్ లైస్, ఇంటర్‌స్టెల్లార్, ది మార్టిన్ కూడా పలుకారణాలతో ఇర్ఫాన్ వదులుకున్నాడు.
ఐశ్వర్యా రాయ్
ఐష్ కూడా కొన్ని క్రేజీ ప్రాజెక్టులను వదులుకున్నది.హిస్టారికల్ వార్ ఫిల్మ్ ట్రోయ్ కూడా ఒకటి.ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ సినిమాలో డైనా క్రూగర్ నటించిన పాత్రను మన ఐష్ చేయాల్సి ఉన్నా నో చెప్పింది.