గుప్తా బ్రదర్స్‌తో సంబంధాలు.. అవినీతిలో భాగస్వామ్యం: దక్షిణాఫ్రికాలో భారత సంతతి వ్యాపారవేత్త అరెస్ట్

వివాదాస్పద గుప్తా కుటుంబంతో సంబంధాలు ఉండటంతో పాటు వారి అవినీతి కుంభకోణంలో పాలుపంచుకున్నాడనే అభియోగంపై ఒకప్పుడు దక్షిణాఫ్రికాలోని వాణిజ్య, పరిశ్రమల శాఖలో కీలక అధికారిగా వ్యవహరించిన ఇక్బాల్ మీర్ శర్మను గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు.ప్రజాధనం వ్యయానికి సంబంధించిన నిబంధనలను అతిక్రమించారనే దానిపై ఇక్బాల్‌తో పాటు మరో ముగ్గురు అధికారులపైనా అభియోగాలు మోపారు.

 Top Indian-origin Businessman In South Africa Arrested For Corruption, Iqbal Mir-TeluguStop.com

ఇక్బాల్ శర్మ సొంత సంస్థ అయిన నూలాండ్ ఇన్వెస్ట్‌మెంట్ ద్వారా 20 మిలియన్ రాండ్లను లాండరింగ్ చేశారని ప్రభుత్వం ఆరోపించింది.

ఎస్తీనా డెయిరీ ఫామ్ ప్రాజెక్ట్.

భారతీయ కంపెనీ పరాస్ భాగస్వామ్యంతో చిన్న తరహా నల్లజాతి రైతులకు ప్రయోజనం చేకూరుస్తుందో లేదో తెలుసుకోవడానికి ప్రభుత్వం ఓ అధ్యయనం చేయించింది.ఇందుకోసం 1.5 మిలియన్ రాండ్లను వెచ్చించింది.అయితే అనేక ప్రభుత్వ, పారాస్టాటల్ సంస్థల నుంచి బిలియన్ రాండ్లను కొల్లగొట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న గుప్తా కుటుంబానికి ఈ వెంచర్ నుంచి ఎస్తీనా ప్రాజెక్ట్ మిలియన్ల కొద్దీ డబ్బును తరలించినట్లుగా తెలుస్తోంది.

గుప్తా సోదరులు అజయ్, అతుల్, రాజేశ్‌లు ప్రస్తుతం దుబాయ్‌లో అజ్ఞాతంలో వున్న సంగతి తెలిసిందే.ఇరుదేశాల మధ్య నేరస్తుల అప్పగింతపై ఒప్పందం లేనందున దక్షిణాఫ్రికా ప్రభుత్వం ఐక్యరాజ్యసమితి సాయంతో వారిని రప్పించేందుకు ప్రయత్నిస్తోంది.

ఆ సమయంలో నూలాండ్ ఈ అధ్యయనాన్ని రెండు కంపెనీలకు ఔట్‌సోర్సింగ్ కింద నిర్వహించింది.ఇందుకు గాను 24 మిలియన్ రాండ్లను అధికంగా వసూలు చేసింది.

Telugu Ajay, Atul, Gupta Brothers, Newland, Paras, Peter Tabeta, Rajesh-Telugu N

కాగా, ఇక్బాల్ శర్మతో పాటు వ్యవసాయ శాఖ మాజీ అధిపతి పీటర్ తబేతాను పోలీసులు రిమాండ్‌కు తరలించారు.వీరిద్దరి బెయిల్ పిటిషన్‌పై జూన్ 7న విచారణ జరగనుంది.2002లో దక్షిణాఫ్రికా వాణిజ్య, పరిశ్రమల విభాగంలో డైరెక్టర్‌గా వున్న ఇక్బాల్ శర్మ అప్పటి వాణిజ్య కార్యదర్శి దీపక్ ఛటర్జీతో కలిసి జోహన్నెస్‌బర్గ్‌లో మూడు రోజుల ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.ఇరు దేశాల మధ్య సహకారాన్ని మరింత బలపరిచేందుకు గాను ఈ భేటీ నిర్వహించారు.

చారిత్రాత్మకంగా తమకు రాజకీయ, సాంస్కృతిక సంబంధాలు వున్నాయని.అయితే అప్పటి భారత ప్రధాని ఐకే గుజ్రాల్ దక్షిణాఫ్రికాను సందర్శించిన తర్వాత ఇవి మరింత మెరుగుబడినట్లు శర్మ నాటి సమావేశంలో అన్నారు.ప్రభుత్వంలో పలు ఉన్నత పదవులు నిర్వర్తించిన అనంతరం ఇక్బాల్ శర్మ సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించారు.2012లో ముంబైలో జరిగిన ఓ ఘటనలో ఇక్బాల్ శర్మపై చేయిచేసుకున్నారన్న అభియోగంపై ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube