ఆ విషయంలో నువ్వానేనా అంటున్న టాప్ హీరోయిన్స్..!

తెలుగు చిత్ర పరిశ్రమలో కాజల్, సమంత గురించి తెలియని వారంటూ లేరు.ఈ ఇద్దరు భామలు చిత్ర పరిశ్రమకు ఒకేసారి అడుగు పెట్టారు.

 Top-who Say You Are In That Regard Kajal-samantha-  That Matter- Top- Web Series-TeluguStop.com

వారి నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసున్నారు ఈ భామలు.వీళ్లిద్దరు కలిసి కూడా పలు చిత్రాల్లో నటించారు.

బృందావనం బ్రహ్మోత్సవం అదిరింది వంటి సినిమాల్లో వీళ్లిద్దరు కలిసి నటించారు.ఇక సమంత నాగ చైతన్యని పెళ్లి చేసుకున్న తరవాత కూడా సినీ రంగంలో రాణిస్తూన్నారు.

ఇక కాజల్ అగర్వాల్ కూడా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.ఈ అమ్మడు కూడా పెళ్లి తర్వాత సినిమాలో నటిస్తుంది.

అయితే ఈ భామలు మరోసారి నువ్వా నేనా అంటూ మరోసారి బరిలోకి దిగనున్నారు.

ఇక పెళ్లి తరవాత కాజల్ అగర్వాల్ చిరంజీవి, రామ్ చరణ్ నటిస్తున్న ఆచార్య సినిమాలో కథానాయిక నటిస్తోంది.

ఇక వీటితో పాటు పాన్ ఇండియా సినిమా కమల్ హాసన్ భారతీయుడు 2 లో ఓ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తోంది ఈ భామ.ఇక కాజల్ అగర్వాల్ తొలిసారి ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తోంది.ఇక ఆ సిరీస్ పేరు లైవ్ టెలికాస్ట్.ఈ వెబ్ సిరీస్ డిస్నీ హాట్ స్టార్‌లో ప్రసారం కానుంది.ఈ నెల 12న సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌ కు మంచి స్పందన వచ్చింది.

Telugu Amzon Prime, Kajal, Live Telecast, Ott Platfram, Samantha, Matter, Web-La

ఇక మరోవైపు సమంత కూడా పెళ్లి తర్వాత తన కెరీర్‌ ను మూడు హిట్లు.ఆరు ఆఫర్లు అన్నట్లుగా కొనసాగుతుంది.ఇక ఓ వైపు సినిమాలో నటిస్తూనే మరోవైపు ఆహా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ‌లో సామ్ జామ్ ప్రోగ్రామ్‌ కు హోస్ట్‌ గా వ్యవహరించింది.ఇక సమంత కూడా ఓ వెబ్ సిరీస్ లో నటిస్తుంది.2019లో అమెజాన్ ప్రైమ్‌ లో సూపర్ సక్సెస్ అయిన ది ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్‌కు కొనసాగింపుగా ది ఫ్యామిలీ మెన్ – 2 వెబ్ సిరీస్‌ను తెరకెక్కించారు.ఇక ఈ వెబ్ సిరీస్ రెండో భాగంలో సమంత రాజీ అనే విలన్‌ పాత్రలో నటిస్తోంది.

ఇప్పటికే సమంతను పాత్రను పరిచయం చేస్తూ ప్రోమోను కూడా విడుదల చేసారు.ఇప్పుడు మాత్రం ఒకే రోజు తమ వెబ్ సిరీస్‌లతో ఓటీటీ ఫ్లాట్‌ ఫామ్స్‌ లో పోటీపడుతున్నారు.

మరి ఈ పోరులో ఎవరు విజేతలుగా నిలుస్తారనేది చూడాలి మరి.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube